కేసీఆరే అలా మాట్లాడారా..? కేటీఆర్ సాధించకున్నారా.? తెలీదు కానీ చానా రోజులుగా జరుగుతున్న చర్చకు కొంత ముగింపు కన్పిస్తోంది. అదేంటీ అని జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు. నిన్నటికి నిన్న ఎప్పటి నుంచి జరుగుతుంది.. జరుగుతుంది అనుకుంటున్న ఎయిర్‌పోర్టుకు మెట్రో రెండో దశ శంకుస్థాపన సభలో కేసీఆర్ ఓ మాట అన్నారు. ఆయన అన్నది ఏంటంటే.. ‘‘మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో భవిష్యత్‌లో ఇంకా చాలా విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది”అని కేసీఆర్ అన్నారు. ఎప్పుడో ప్రారంభమే కావాల్సిన మెట్రో రెండో దశ శంకుస్థాపన మీటింగ్‌లో.. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అన్నది కేసీఆర్ సూత్రప్రాయంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సారీ బీఆర్ఎస్ (గెలిస్తే) గెలవగానే కేటీఆరే సీఎం అవుతారా..? లేకుంటే ముందు కేసీఆర్ అయిన తర్వాత మంచి టైము చూసి కేటీఆర్‌ను సీఎం చేస్తారా..? అన్నది వచ్చే ఏడాది ముచ్చట. ఈ ముచ్చట కూడా బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే సీట్లు.. ఆ తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచే సీట్లను బట్టి ఉంటుంది. ఇప్పుడే సంబురపడాల్సిన అవసరమైతే లేదు. సంబుర పడతామని అనుకుంటే కానీయండి.