Home breaking news ఇలా మనం బతకగలమా..?

ఇలా మనం బతకగలమా..?

109
0

ఒక్క క్షణం కళ్లు మూసుకోండి. ఇప్పుడు 70 ఏండ్లున్న మధ్య తరగతి వ్యక్తి చిన్న తనాన్ని గుర్తు చేసుకుంటే.. కరెంట్​ లేకుండా గ్యాసు నూనెతో మిణుకు మిణుకుగా వెలిగే గుడ్డి దీపం వెలుగు కన్పిస్తోంది. ఫోన్​ సౌకర్యం లేకుండా.. చావు,బతుకుల సమాచారం రావాలంటే మనిషే రావాలి. అది వస్తే సైకిల్​పై లేకుంటే నడిచి. ఇప్పుడు ఇలా బతకగలమా..? ఇవన్నీ కాదు కానీ కరెంట్​, ఫోన్​ అందునా స్మార్ట్​ ఫోన్​ లేకుండా బతకగలమా..? కష్టమే. మామూలు కష్టం కాదు. వెరీ వెరీ కష్టం. మనమింత కష్టమని అనుకుంటున్న జీవితాన్ని కొన్ని కుటుంబాలు అలవోకగా కొనసాగిస్తున్నాయి. అది కూడా ఎప్పుడో కాదు.. ఈ 2022లోనూ. ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం పరిధిలోని అంతకాపల్లి అడవుల్లోని కూర్బ గ్రామం వెళితే చాలు. ఓ వందేళ్లు వెనక్కి పోవాల్సిందే. ఆ ఊరిలో మట్టి గోడలు, పెంకలతో నిర్మించుకున్న ఇండ్లలో 56 మంది జీవిస్తున్నారు. వీరిలో 12 ఫ్యామిలీలు ఉన్నాయి. 16 మంది స్టూడెంట్స్​, ఆరుగురు బ్రహ్మచారులున్నారు. వీరు సొంతంగా పనులు చేసుకోవడంతో పాటు రసాయనాలు లేకుండా పంటలు పండించుకొని బతుకుతున్నారు. కరెంట్​ లేదు. ఫోన్​, స్మార్ట్​ఫోన్​ సౌకర్యం కూడా లేదు. భక్తి వేదాంతస్వామి ప్రభుపాదుల ఆదేశంతో 2018లో ఈ గ్రామం ఏర్పడింది. కృష్ణ చైతన్య సమాజంలో సాగుతోంది. హిందీ, తెలుగు, ఇంగ్లిష్​ భాషలు వస్తాయి. ఆధ్యాత్మికత జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి జీవితం మనం గడప గలుగుతామా..? ఈ గ్రామానికి సంబంధించిన వార్తను ఈనాడు పేపర్​ కవర్​ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here