Home breaking news కేసీఆర్​ అన్నారు.. మనమిన్నాం అంతే

కేసీఆర్​ అన్నారు.. మనమిన్నాం అంతే

93
0

కేసీఆర్​ అంటే ఏంటో మనందరికీ తెలుసు. నిజా నిజాల సంగతి పక్కన పెడితే ఆయన మాట ఎంత గట్టిగా మాట్లాడుతారో ఎరికే. కేసీఆర్​ మాట్లాడినంత వరకూ అన్నీ నిజమే అన్పిస్తాయి. ఆ తర్వాత నిఝంగా ఇలా జరిగిందా.? జరుగుతుందా..? అన్న సంక్లిష్ట అనుమానాలు కలుగుతాయి. ఆడేదీ రాజకీయ చదరంగం కాబట్టి..  నిందలు వేయడం.. వేసుకోవడం సహజాది..సహజం. సరే విషయానికొస్తే నిన్న మహబూబ్​నగర్​లో కలెక్టరేట్​ ప్రారంభం, ఆ తర్వాత జరిగిన మీటింగ్​లో కేసీఆర్​ విశ్వరూపం ప్రదర్శించారు. ఎవరికీ తెలియని.. హెచ్చరికను బయట పెట్టారు. ‘కేసీఆర్​ నీ సర్కార్​ను కూలగొడ్తా’ అని మోదీ అన్నట్టుగా చెప్పారు. ఎప్పడన్నారని ఆలోచించినా ఊహకు అందలేదు. అర్రె అప్పుడు గుర్తొచ్చింది.. మొన్న నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం విషయం. దీంట్ల మోదీ ఎప్పుడు మాట్లాడారన్నదైతే అంతు చిక్కలేదు. డైరెక్ట్​గా లేకుంటే ఇండైరెక్ట్​గా అన్నారా…? ఎప్పుడు అన్నది.. ఓ మిలియన్​ ప్రశ్న. కానీ పశ్చిమబెంగాల్​ ముఖమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి మోదీ ఓ మారు అన్నట్టుగా చూశాం. అక్కడ మమతను అన్నారు కాబట్టి తనను కూడా అన్నారని కేసీఆర్​ అనుకున్నారా..? లేకుంటే​ కేసీఆర్​తో మోదీ ల్యాండ్​లైన్​ ఫోన్​లో మాట్లాడితే.. అప్పుడేమైనా ‘కేసీఆర్​ నీ సర్కార్​ను కూలగొడ్తా’ అని అన్నారా… ? అని ఉండవ్చు. ఏం జరిగిందో మనకైతే తెలియదు కానీ మోదీ అన్నారని కేసీఆర్​ అన్నారు. మనం విన్నాం అంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here