Home breaking news ఈడీ కవరేజీలో నా పేపర్​ నా ఇష్టం

ఈడీ కవరేజీలో నా పేపర్​ నా ఇష్టం

130
0

ఒకప్పుడు అంటే వార్త పేపర్​ రాకముందు ఆంధ్రజ్యోతి రీ ఎంట్రీ కాకముందు సాక్షి పేపర్​ రాకముందు.. నమస్తే తెలంగాణ రాకముందు కూడా ఈనాడు ఏదీ రాస్తే అదే వార్త. వార్త వచ్చిన తర్వాతే పేపర్​  కవరేజీలో కొంత మార్పు. ఆంధ్రజ్యోతి రీ ఎంట్రీ తర్వాత న్యూస్​ కవరేజీ తీరే మారిపోయింది. సాక్షి వచ్చిన తర్వాత నాణానికి రెండు వైపులా అన్నట్టుగా రీడర్​ అంచనా వేయడం మొదలైంది. నమస్తే తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమ వార్తలు ఒక్క ఆంధ్రజ్యోతిలో కన్పించేవీ. ఈనాడు ఏదో రాశామూ అంటే రాశామన్నట్టుగా రాసేదీ. నమస్తే తెలంగాణ వచ్చిన తర్వాత తప్పని సరిగా తెలంగాణ ఉద్యమ వార్తలు రాయాల్సిన పరిస్థితి పత్రికలకు ఏర్పడింది. సరే ఆ తర్వాత మన తెలంగాణ, నవ తెలంగాణ, ప్రజాపక్షం, వెలుగు పేపర్లు వచ్చాయి. ఇప్పుడు ఏ పేపర్​ చూసిన ఒక్కో పేపర్​ ఒక్కో పార్టీకి అనుబంధంగా మారిపోయాయి. టీఆర్​ఎస్​ అధికారంలో ఉంది కాబట్టి కొంత అటువైపే పేపర్లు మొగ్గు చూపుతున్నాయి. సరే లిక్కర్​ కేసులో ఈడీ దర్యాప్తు.. రిమాండ్​ రిపోర్ట్​లో కవిత పేరు. ఈ వార్త కవరేజీ విషయానికొస్తే ఆంధ్రజ్యోతి, వెలుగు ప్రధాన వార్తగా కవిత ఫొటో బ్యానర్​లో వేసి మంచి కవరేజీ ఇచ్చాయి. ఇక ఈనాడు.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నప్పటికీ.. కేసీఆర్​ కుమర్తె ఉన్నారు కాబట్టి విధిలేని పరిస్థితిలో 36 మందిలో కవిత ఒకరు అన్నట్టుగా ఇచ్చారు. సాక్షి విషయానికొస్తే అసలు ఈ వార్తకే ప్రియారటీ ఇవ్వకుండా అడుగున పడేసింది. ఎందుకంటే ఈ కేసులో తెలంగాణ సీఎం కుమార్తె కల్వకుంట్ల కవితతో పాటు తమ పార్టీకే చెందిన ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు కాబట్టి  అడుగున పడేశారు. ఇక నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, మన తెలంగాణ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ వార్తను ఈ పేపర్లు అసలు వేయనేలేదు. ఇక టీఆర్​ఎస్​ మిత్రపక్షమైన సీపీఎం పేపర్​ అయిన నవ తెలంగాణలో ఏదో వేశామంటే వేశామన్నట్టుగా వేశారు. అందుకే లిక్కర్​ స్కాం కేసులో ఈడీ రిమాండ్​ రిపోర్ట్​ వార్త నా పేపర్​.. నా ఇష్టం అన్నట్టుగా మీడియా సంస్థల యాజమాన్యాలు వ్యవహరించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here