–మంజుల పత్తిపాటి, కవయిత్రి
ఎన్ని అలజడలు సృష్టించిన ఎన్ని ఆటంకాలు
ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానాని
తన కుటుంబానికి ధైర్యం చెప్పే మగధీరుడు మగవాడు..!
పండుగ పబ్బాల రోజున
తాను చిరిగిన చొక్కాలు వేసుకుంటూ
కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రములు కొనిచ్చిన
త్యాగమూర్తి మగవాడు..!
మదిలో బాధలు ప్రళయ తాండవం చేస్తున్నా
కన్నీళ్ళను కనురెప్పల మాటున దాచుకొని
చిరునవ్వులు చిందిస్తున్న చిరంజీవి మగవాడు..!
తాతగా, నాన్నగా, బాబాయిగా, మామయ్యగా
అన్నగా, భర్తగా వివిధ పాత్రలు పోషిస్తూ
బాధ్యలు తీసుకొని ఆనందాలు పంచిన
అమృతమయుడు మగవాడు..!
నవమాసాలు మోసి,బిడ్డని కనేది అమ్మ అయితే
బిడ్డ పుట్టిన క్షణం నుండి తన ప్రాణం కంటే ఎక్కువగా
చూసుకునే వాడు ( నాన్న) మగవాడు..!
పిల్లల లోపాలను సరిచేస్తూ ఎదుగుదలలో
భవిష్యత్తుకు పునాదులు వేస్తూ బ్రతుకుదారిలో
గమ్యంచేర్చే ఆదర్శదైవం మగవాడు..!
