ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ‘రామాయణంలో పిడకల వేట’ అంటూ కామెంట్లు వినపడుతూ ఉంటాయి. అంతెందుకు మురళీమోహన్, దీప హీరో హీరోయిన్లుగా 1980 లో రామాయణంలో పిడకల వేట సినిమా కూడా వచ్చింది. అసలీ పిడకల వేట గోలెందుకు అనుకుంటున్నారా..? ఏం లేదు. ఏదైన సీరియస్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు మధ్యలో మరో విషయం ప్రస్తావిస్తే ‘రామాయణంలో పిడకల వేట’ అంటూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ దర్యాప్తు జరుగుతోంది. కవితను అదే కేసీఆర్ కూతురు. ఆమెను కూడా పార్టీ మారాలని బీజేపీ వాళ్లు కోరినట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మధ్యలో ఎంపీ ధర్మపురి అరవింద్ వచ్చి కవితే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేను అప్రోచ్ అయ్యిందంటూ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ విన్న కవితకు కోపమొచ్చేసీ ‘ఏయ్ అర్వింద్ నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం, ఆ వెంటనే ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి జరిగిపోయింది. అర్వింద్ మామూలోడేం కాదుగా.. ఆయన మాటల మరాఠీ. నీకు బీజేపీ వాళ్లు ఫోన్ చేశారని మీ అయ్య అదే కేసీఆర్ అంటే చప్పుడు చేయవు కానీ నేను అంటే తిట్టి.. నా ఇంటి మీద దాడి చేయిస్తవా.? అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్యలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి జోక్యం చేసుకొని కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీలో చేర్చుకోమని అని స్టేట్మెంట్ ఇస్తే.. మరో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాత్రం కేటీఆర్, కవిత వస్తే బీజేపీలో చేర్చుకుంటామంటారు. మధ్యలో రేవంత్రెడ్డి కల్పించుకొని అసలు కవితతో మాట్లాడిన బీజేపీ లీడర్లు ఎవరన్న స్టేట్మెంట్ నమోదు చేయాలని అంటున్నాడు. అసలు కవితను కాంగ్రెస్లోకి ఆహ్వానించలేదంటూ చెప్పుకొచ్చాడు. ఏదీ ఏమైనా ఎమ్మెల్యేల కొనుగోలులో నిజమెంతో అబద్ధమెంతో కానీ ఈ పిడకల వేట మాత్రం సాగుతోంది.
- breaking news
- Tech
- Entertainment
- Politics
- కామెడి
- జాతీయం
- తాజా వార్తలు
- తెలంగాణ/ఆంధ్రప్రదేశ్
- మీడియా
- సినిమా
- రివ్యూస్