ఓ మంచి వ్యక్తి సర్పంచ్ అయితే ఆ ఊరు బాగుపడుతుందని అనుకుంటాం. ఓ కోటిశ్వరుడు సర్పంచ్ అయితే కూడా ఫండ్స్ రాకున్నా డెవలప్ అయితదని అనుకుంటాం. సామాన్యుడు సర్పంచ్ అయితే ఆ ఏముంది సర్కారు దయతలిస్తే డెవలప్ అయితదని అనుకుంటాం. అదే ఆ ఊరును సీఎం దత్తత తీసుకుంటే అసలు ఆ ఊరుకు తిరుగే లేదని అనుకుంటాం. కానీ సీఎం దత్తత తీసుకున్నా డెవలప్ కాకుంటే. ఆ ఊరుకు డెవలప్ అయ్యే అదృష్టం లేదని అనుకుంటాం. అచ్చం ఇట్లనే.. ఉంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి పరిస్థితి. ఈ వాసాలమర్రిని 2020 నవంబర్ 1న తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. ఊర్లో ఉన్నోళ్లందరికీ కొత్తగా ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. దత్తత తీసుకొని రెండేళ్లు, కొత్తగా ఇండ్లు కట్టిస్తానని చెప్పి ఏడాది గడిచిపోయింది. ఇప్పటివరకూ ఆ ఊరికి ఒరిగిందేమీ లేదు. ఇదంతా జరిగినా ఆ ఊరు డెవలప్ కాలేదంటే అసలు అవుతుందా.. ? డౌటే. అదృష్టం ఉంటే అవుతుంది. ఆ ఊరు స్టోరీ వెలుగు పత్రికల్లో వచ్చింది. ఈ క్లిప్పింగ్ అదే చదవండి.

