కమ్యూనిస్టులు అంటే దేశంలో ఉన్న వందా రెండొందల పార్టీలు కాదు. జస్ట్ సీపీఎం, సీపీఐ మాత్రమే. ఇంకా చెప్పుకోవాలంటే అడవుల్లో సంచరించే మావోయిస్టులు. అయితే ఈ మావోయిస్టులు ఎలాగు ఎన్నికల్లో పోటీ చేయరు కాబట్టి.. వారిని పక్కన పెట్టేద్దాం. 2014 ఎన్నికల్లో సీపీఎం, సీపీఐకి చెరో ఒక ఎమ్మెల్యే గెలిచారు. వీరిలో సీపీఐ ఎమ్మెల్యే రవీందర్‌నాయక్.. పార్టీ పుట్టి ముంచేసీ గాయబై టీఆర్ఎస్లో చేరిపోయిన సంగతి ఊరూ వాడకు ఎరికే. 2018 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేరు. ఒకప్పుడు కమ్యూనిస్టులను తోకపార్టీలన్న కేసీఆర్ ఇప్పుడు తన అవసరం కొద్ది మునుగోడు ఉప ఎన్నికల్లో కలుపుకున్నడు. ఆ గెలుపు తమదే అని కమ్యూనిస్టులు అనుకుంటూ ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే నిన్నటికి నిన్న ఖమ్మంలో సీపీఎం సెక్రెటరీ తమ్మినేని వీరభద్రం మాత్రం.. టీఆర్ఎస్తో తమ అంటే కమ్యూనిస్టుల పొత్తు కంటిన్యూ అవుతుందని, ఈసారి అప్పుడెప్పుడో టీడీపీతో పొత్తు పెట్టుకొని తక్కువ సీట్లలో పోటీ చేసినట్టు కాకుండా ఎక్కువ సీట్లలో పోటీ చేస్తామని చెప్పేశారు. బాగానే ఉంది కానీ అప్పుడెప్పుడో కమ్యూనిస్టులు తాము బలంగా ఉండి గెలిచిన అన్ని సీట్లలో ఇప్పటి మునుగోడు సహా అన్నింటిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు పొత్తు కుదిరితే నల్గొండ,ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఇస్తే ఒకటో రెండో విదిలిస్తారు తప్ప.. అప్పట్లో కమ్యూనిస్టులు నిలిచి గెలిచిన సీట్లన్నింటిని కేసీఆర్ ఇవ్వరు. ఇస్తరని అనుకుంటే కమ్యూనిస్టులకు దింపుడు కల్లం ఆశే. అయినా కేసీఆర్‌కు ఈ తమ్మినేని, కూనంనేని సాంబశివరావుతో పనేంటి.? డైరెక్ట్‌గా సీతారాం ఏచూరీ, డీ రాజాతో మాట్లాడుకుంటారు కేసీఆర్. అక్కడే సెటిల్ చేసుకుంటారుగా తమ్మినేని.. ఎందుకూ అడ్వాన్స్ పొత్తు, ఎక్కువ సీట్లలో పోటీ స్టేట్మెంట్లు. అయినా ఆశలో ఉన్న ఆశిస్తున్న తెలంగాణ కమూనిస్టులకు అందులో తమ్మినేనికి అడ్వాన్స్ కంగ్రాట్స్.
- breaking news
- Tech
- Entertainment
- Politics
- కామెడి
- జాతీయం
- తాజా వార్తలు
- తెలంగాణ/ఆంధ్రప్రదేశ్
- మీడియా
- సినిమా
- రివ్యూస్