దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఎన్నికగా మునుగోడు రికార్డ్ సాధించింది. దీంతో పాటు అతి ఖరీదైన ఎన్నికగా మునుగోడు నిలిచిపోనుంది. ప్యాకేజీలను బట్టి టీఆర్ఎస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి టీఆర్ఎస్కు సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు మారుతూనే ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో స్థాయి అంటే లక్షల్లోనే రేటు నిర్ణయించి పార్టీలో చేర్చుకుంటున్నారు. చేరిన తర్వాత ప్యాకేజీ పెరిగితే మళ్లీ చేరుతూనే ఉన్నారు. ఇటువంటి ఎన్నిక ఇప్పటివరకూ దేశంలో ఎక్కడా జరగలేదు. ఇకముందు జరిగే అవకాశం మాత్రం ఉంటుంది. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ ఫుల్‌గా ఖర్చు పెడుతుండగా కాంగ్రెస్ లిమిట్‌గా ఖర్చు చేస్తోంది. టీఆర్ఎస్ కమ్యూనిటీ హాల్స్ పేరుతో ఒక్కొక్కదానికి రూ.12 లక్షలు నిర్ణయించి ఇచ్చేస్తున్నారు. అంటే టోకున కులాల ఓట్లు కొంటున్నారు. మళ్లా ఇంటింటి ఖర్చు వేరే. ఎటూ చూసినా బీజేపీ, టీఆర్ఎస్ పెట్టే ఖర్చు వందల కోట్లలోనే ఉంటుందని అనధికార సమాచారం
- breaking news
- Tech
- Entertainment
- Politics
- కామెడి
- క్రైమ్
- జాతీయం
- తాజా వార్తలు
- తెలంగాణ/ఆంధ్రప్రదేశ్
- మీడియా
- సినిమా
- రివ్యూస్