ఎవరికైనా దెబ్బ తగిలితే ఏం చేస్తరు.. కచ్చితంగా రెస్ట్ తీసుకుంటారు. ఆలోచిస్తరు తప్ప.. ఏం పని చేయరు. టైంపాస్ కోసం టీవీల్లో సినిమాలు చూస్తరు. అబ్బే అన్ని పాతవే వేస్తున్నారని అనుకుంటే ఉందిగా ఓటీటీ. అందులో కొత్తవి కొనుక్కొని మరీ చూస్తరు. కానీ పని అయితే చేయరని అనుకుంటే మీరు కారు కింద కాలు వేసినట్టే. అందరూ రెస్ట్ తీసుకుంటారా.. ? కొందరు పని చేతకాని వాళ్లు రెస్ట్ తీసుకుంటరు. అంతెందుకు తెలంగాణ మంత్రి అదే రాకుమారుడు అదే కల్వకుంట్ల తారక రామారావు అనబడే కేటీఆర్‌ను చూడండి. కాలుకు దెబ్బ తగిలింది. మూడు వారాల పాటు డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నరు. రెస్ట్ తీసుకొని టీవీల్లో సినిమాలో.. లేకుంటే ఓటీటీ ఉండనే ఉందిగా అందులో ఏదో ఒకటి చూసి టైంపాస్ చేయవచ్చుగా.. అలా చేయకుండా కష్టపడడంలోనే సంతృప్తి ఉందని అనుకున్నట్టున్నారు.. అందుకే ఎంచాక్క కాలుకు పట్టేసుకోని.. ఇంట్లో సోఫాలో కూర్చుని చకా చకా ఫైళ్లు క్లియర్ చేసేస్తున్నారు. చూశారా.? ఇలా అందరూ పని చేస్తే ఎంత బాగుంటుంది. కేటీఆర్ ఇంత పని చేస్తున్నా.. పడనోళ్లు అదే ప్రతిపక్షపోళ్లు.. ఎక్కిరిస్తున్నరు. అరే పని చేసేవాళ్లని ప్రోత్సహించాలి. అభినందించాలే కానీ ఇలా ఎక్కిరించడం బాగాలేదబ్బ. అయితే మొన్నటికి మొన్న కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో ”నా కాలికి అనుకోకుండా గాయమైంది. మూడు వారాల పాటు డాక్టర్స్ నన్ను రెస్ట్ తీసుకోమన్నారు. ఓటీటీలో మంచి కంటెంట్ చూడటానికి ఉంటే సజెస్ట్ చేయండి” అని పోస్ట్ చేశారు. దీనిపై రాజకీయంగా పడిరానోళ్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందేగా. ఆళ్ల విమర్శలకే కేటీఆర్ పని చేస్తున్నారని కొందరు అంటున్నరు. ఏది ఏమైనా నూటికి నూరుపాళ్లు కేటీఆర్‌ను అభినందించాల్సిందే. ఇందులో ఏ మాత్రం డౌట్ అసలే లేదు. మీడియాలో కూడా చూడండి ఎంతబాగా వార్తలొచ్చాయో. అభినందించడం నేర్చుకోవాలండి లేకుంటే ఎలా..?