Home breaking news national political party పెడతా– కేసీఆర్ ట్విస్ట్ ఎపిసోడ్

national political party పెడతా– కేసీఆర్ ట్విస్ట్ ఎపిసోడ్

330
0
KCR to launch a national political party

ప్రధాని నరేంద్రమోదీపై సీఎం కేసీఆర్ నిప్పులు కక్కే ఆరోపణలతో నడుస్తున్న సీరియల్​ మూడో రోజుకు చేరుకుంది. జనవరిలో ప్రారంభమైన ఈ సీరియల్​  ఫిబ్రవరి 2న పున: ప్రారంభమైంది. ఆ వెంటనే ఆపి 11న ప్రారంభించారు. మూడు రోజులుగా  రోజుకో ఎపిసోడ్​ లెక్కన కేసీఆర్​ సీరియస్​గా రిలీజ్​ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్లు ఒకేతీరుగా ఉంటున్నాయి. సబ్జెక్ట్​ అదే. కానీ తిట్లే వెరైటీగా ఉంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రెండో ఎపిసోడ్​లో రాహుల్​గాంధీపై జాలి కురిపించారు. ఏడుపొచ్చిందని అన్నారు కూడా.  బీజేపీ మంత్రుల అవినీతి చిట్టా ఉందని చెప్పుకొచ్చారు. అది బయట పెడ్తా అన్నారు. ఈ  రోజు ప్రెస్​మీట్​ అనగానే అదే అవినీతిని ఖండ ఖండలుగా చెప్పుకొస్తాడని అనుకున్నా.. ఎందుకో చెప్పలేదు. కరెంట్​పైనే కడిగిప ఆరేశారు.

కేసీఆర్​ ఏమన్నారంటే

ప్రధాని న‌రేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ మూడోరోజు నిప్పులు చెరిగారు. మోదీ చెప్పేది ఒక‌టి.. చేసేది ఒక్కట‌ని ఆయ‌న అన్నారు. మోదీ అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని.. అందులో భాగంగానే విద్యుత్ సంస్కర‌ణ‌లు తెచ్చిన్రు అని విమ‌ర్శించారు.

‘‘దేశ ప్రజ‌లంతా కోరితే.. అంద‌రూ కోరితే త‌ప్పకుండా దేశ‌వ్యాప్తంగా పార్టీ పెడ‌తా.. అని సీఎం కేసీఆర్ చెప్పారు. కేసీఆర్‌కు ద‌మ్ములేదా.. అధికారం లేదా.. త‌ప్పకుండా అవ‌స‌రం వ‌స్తే పార్టీ పెడ‌దాం. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాడు ఏమ‌న్నరు.. ఇప్పుడు ఏమైంది.. ఇది ప్రజాస్వామ్యం.. ప్ర‌జ‌లు అనుకున్న నాడు త‌ల‌కిందులు అయిత‌ది. కేసీఆర్ నీటిబొట్టు అంత కాదు అన్న‌రు నిన్న‌.. మ‌రి నీటిబొట్టు లాంటి కేసీఆర్ ను చూసి ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు. ఇప్పుడు కూడా ఏం జ‌రుగుత‌దో ఎవ‌రికి తెలుసు. నేను రైల్వే స్టేష‌న్‌లో చాయ్ అమ్ముకున్నా అని మోదీనే చెప్పారు క‌దా. ఆయ‌న ప్రధాన మంత్రి కాలేదా. సినిమా న‌టులు ముఖ్యమంత్రులు కాలేదా. ఎంజీఆర్, ఎన్టీఆర్ ముఖ్యమంత్రులు అయ్యారు. ఏం జ‌రుగుతుందో నాకు తెలియ‌దు కానీ.. ఏదో ఒక‌టి మాత్రం జ‌రుగుతుంది.’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

 “నిన్న, మొన్న జనగామ, యాదాద్రి జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా బహిరంగ సభలో అన్ని విషయాలు చెప్పలేం. అయినా ప్రజలకు కొన్ని వివరాలు చెప్పాలని చెప్పాం. నరేంద్ర మోదీ గారు ఆయన చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి ఉంటున్నది. అబద్దాలు చెబుతున్నరు. అందులో భాగంగానే విద్యుత్‌సంస్కరణలు తెచ్చింన్రు. డ్రాఫ్ట్‌బిల్లు రెడీ అయ్యింది. డ్రాఫ్ట్‌బిల్లు చేసి రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్‌లేఖ రాశారు. దానికి జవాబు ప్రధానికి లేఖ రాశారు. అదే కాకుండా తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపాం. వీటన్నింటిని మించి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్లియర్‌గా వాళ్ల పాలసీ చెప్పారు. అడిషనల్‌బారోఇంగ్‌లింక్డ్‌టూ పవర్‌సెక్టార్‌రిఫార్మ్స్‌. ఇది పార్లమెంట్‌లో వాళ్లు ఇచ్చిందే.. ఇది కేసీఆర్‌స్టోరీ కాదు. అగ్రికల్చర్‌సెక్టార్‌కు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు.. ప్రీపెయిడ్‌ మీటర్లు పెట్టాలి. కేంద్రం పంపిన ముసాయిదా బిల్లు. అది మెడమీద వేలాడుతున్న కత్తి. బిల్లు పాస్‌కాకముందే.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఈ రీఫామ్స్‌చేస్తరో అడిషనల్‌గా 0.5 ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తమని ప్రకటించారు. అది ఐదేళ్లు ఇస్తమని ప్రకటించారు.

పోయిన ఏడాది మనం తీసుకోలేదు. అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తీసుకున్నది. తీసుకోవడంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారు. మిగతా వాటికి టెండర్లు పిలిచారు. రూ.737కోట్లతో టెండర్లు పిలిచారు. 0.5శాతం అడిషనల్‌ఎఫ్‌ఆర్‌బీఎం వస్తే రూ.5వేలపైచీలుకు కోట్లు వస్తయ్‌. రాబోయే ఐదేళ్లకు విద్యుత్‌సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు ఇస్తం.. మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వం. నష్టపోయిన మంచిది నీ డబ్బులు అక్కర్లేదంటే రూ.25వేలకోట్లు నష్టపోవాలే తెలంగాణ. ఆ నష్టం ఉన్నా సరే నేను మీటర్ల పెట్టా అని చెప్పిన. తెలంగాణలో వ్యవసాయస్థిరీకరణ జరగాలే. రైతులు ధనవంతులు కావాలి.. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నరు కాబట్టి నేను పెట్టా అని చెప్పిన. శ్రీకాకుళంలో 25వేల మోటార్లకు పెట్టారు. టెండర్లు పిలిచారు.. ఇంప్లిమెంట్‌చేస్తున్న రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తున్నరు. ఇన్ని ఉండంగ‌.. మొన్న బడ్జెట్‌లో పెట్టారు.. ఇన్ని ఉండంగా.. పార్లమెంట్‌సభ్యుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చదువు వస్తదో రాదు నాకు తెల్వదు. చదివిన కాగితం అర్థమైతదో కాదో. ఆయనను చూస్తే జాలేస్తుంది.. ఆయన మాట్లాడకుండా వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్‌నన్నడిగితే. ఆ పార్టీ పరువు పోతుంది రోజు రోజుకు. ఇవన్ని ఆధారాలుండి.. ఇంత జరిగి.. రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్‌చేసి పంపి.. వ్యతిరేకిస్తూ రాసిన లేఖలు ఉండి పచ్చి అబద్దం చెబుతాం. దీనిపై బహిరంగ క్షమాపణ చెబుతా. మీటర్లు పెట్టుమన్నా..? పెట్టుమనందే జగన్మోహన్‌రెడ్డి పెట్టిండా? శ్రీకాకుళంలా పెట్టిండా. పెట్టుమనంతా ఎఫ్‌ఆర్‌బీఎంలా 0.5శాతం పెట్టినవా?.. దాన్ని మేం ఎందుకు తీసుకుంటలేమ్‌. ఎఫ్‌ఆర్‌బీఎం పవర్‌రీఫామ్స్‌వ్యతిరేకిస్తున్నాం కాబట్టి. ” అంటూ మండిప‌డ్డారు.

ఇవి కూడా చదవండి

నిఝంగా కేసీఆర్​ను గెలికింది బీజేపోళ్లే.. అందుకే తిరగబడుతున్నడు

Regional parties.. విలీనాలు.. ప్రసహనాల్లో.. ఇప్పుడు యువ తెలంగాణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here