ఎవ్వరైనా.. ఎప్పుడైనా.. ఎప్పటికైనా.. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతారా..? అది సాధ్యం కాదు. అది రాజైనా.. పేదోడైనా.. ఇంకెవ్వరైనా సరే అసాధ్యం. రాజకీయ నాయకుల్లో నీరసంగా కన్పించని నాయకుల్లో మనకు ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే కన్పడతారు. వారి హావభావాలు.. ఆ రేంజ్లో ఉంటాయి. సరే విషయానికొస్తే నిన్నటినిన్న సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన పూర్తిగా నీరసంగానే జరిగింది. మొన్నటి ప్రధాని మోదీ పర్యటనకు ముందురోజు సీఎం కేసీఆర్‌కు జొరం వచ్చిందని చదువుకున్నాం. ఆ జొరం నుంచి పూర్తిగా కొలుకున్నట్టుగా లేదు. అయినా.. యాదాద్రి పర్యటనకు కేసీఆర్ వచ్చేశారు. వచ్చినప్పటి నుంచి ఎందుకో నీరసంగానే కన్పించారు.
మొన్నటి ప్రెస్మీట్లో నేను కరోనాకు భయపడను.. మాస్కు తీసి మాట్లాడంటూ జర్నలిస్టుకు సూచించిన కేసీఆర్.. తానే మాస్కు పెట్టకున్నారు. పైగా మాటిమాటికి మఖానికి ఉన్న మాస్కు తీసి.. టవల్‌ను ముక్కును తుడుచుకుంటూ కన్పించారు. మనిషిలో కూడా ఉల్లాసం.. ఉత్సాహం కన్పించలేదు నీరసంగా ఉన్నారు. గుట్టకు వచ్చిన ప్రతిసారి బాలాలయంతో పాటు కొత్తగా నిర్మిస్తున్న ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకునే కేసీఆర్..ఈసారి లోనికి వెళలేదు. బయటే చూసి కిందికి వెళ్లారు. రింగ్‌రోడ్డుపై బస్సులోనే తిరిగేశారు. గుట్టపైకి వెళ్లిన తర్వాత ప్రెస్‌మీట్ పెడుతున్నానని మెసేజ్ ఇచ్చి.. రెండు గంటల తర్వాత క్యాన్సిల్ చేశారు. నాలుగు గంటలు టెంపుల్‌పై రివ్యూ చేసిన కేసీఆర్.. ఈసారి ఎందుకో మంత్రులను లోనికి రానియలేదు. అలా రాత్రి 8 గంటల వరకూ గడిపి.. తిరిగి వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి
CM KCRకు జొరం తగ్గింది.. యాదాద్రికి వెళ్తున్నారు
PM Modi గిచ్చితే నొప్పి పుట్టదా..? కాకుంటే ఇప్పుడు పక్కోడికి..!