అలయ్– బలయ్ అంటే సిద్దాంతాలు.. పార్టీలు కన్పించవు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. కరుడుగట్టిన కమ్యూనిస్టులు.. మతతత్వవాదులంటూ ముద్రపడిన బీజేపీ, సంఘ్ పరివార్ కార్యకర్తలు. కాకలు తీరిన పొలిటిషయన్స్. కమ్యూనిస్టులు వెళ్లడం.. ఆ పార్టీ వాళ్లకు నచ్చదు. వీళ్లు రావడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లకు నచ్చదు. ఇదంతా డిఫరెన్స్ అయినా అలయ్– బలయ్ అంటే దత్తన్న.. దత్తన్న అంటే అలయ్–బలయ్. పదిహేడేళ్లుగా అంటే మధ్యలో రెండేళ్లు 2019–20 తప్ప కంటిన్యూగా సాగుతోంది. ఇన్నేళ్లుగా దత్తన్న పేరుతో సాగిన అలయ్–బలయ్ ఈసారి.. ఆయన ఏకైక సంతానం విజయలక్ష్మి (కొడుకు 2019లో మరణించారు) పేరుతో నిర్వహించారు. ఇప్పుడు దత్తన్న గవర్నర్ కాబట్టి.. విజయలక్ష్మి నిర్వహించారని చెప్పుకుంటున్నారు. కానీ ఈసారి సాగిన అలయ్–బలయ్ అంతా అలగలగ్.
దత్తన్న తన కూతురు బండారు విజయలక్ష్మిని రాజకీయ వారసురాలిగా అరంగ్రేట్రం చేయించారని గుసగుసలు. ఆహ్వాన పత్రికలను అందరి దగ్గరకు వెళ్లి ఇచ్చివచ్చారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులను దగ్గరుండి ఆహ్వానించారు. కార్యక్రమం ముగిసేంతవరకూ అంతా విజయలక్ష్మి దగ్గరుండి చూసుకున్నారు. మధ్యలో ఒకసారి మాట్లాడారు. ఇక్కడి వరకూ ఓకే. అసలు కథ విషయానికొస్తే… బండారు విజయలక్ష్మి డాటార్ ఆఫ్ బండారు దత్తాత్రేయ.. సికింద్రాబాద్ ఎంపీ సీటు కోసం రాజకీయ అరంగ్రేట్రం చేశారని బీజేపీలో టాక్. బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ సీటు అంటే దత్తాత్రేయ. పోయిన్సారీ కిషన్‌రెడ్డికి దక్కింది. లేదా దక్కించుకున్నారు. అంబర్‌పేటలో కిషన్‌రెడ్డి ఓడిపోయారు కాబట్టి.. సికింద్రాబాద్ సీటులో పోటీ చేశారు.. గెలిచారు. అంబర్‌పేటలో కిషన్‌రెడ్డి గెలిచి ఉంటే.. సికింద్రాబాద్ సీటు దత్తాత్రేయకే దక్కి ఉండేదీ. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే… బీజేపీలో కిషన్‌రెడ్డి– దత్తాత్రేయ మధ్య విబేధాలు ఉన్న సంగతి బయట వాళ్లకు తెలీదు. మీడియా ప్రతినిధులకు తెలిసినా.. పట్టించుకోరు. ఎందుకంటే కిషన్‌రెడ్డి.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి అనుంగు శిష్యుడు. వెంకయ్య అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వార్తలు రావు. సాక్షి వాళ్లు కూడా పట్టించుకోరు అదీ విషయం.
Dalit Bandhuకు ఎన్నికల కోడ్.. బీజేపీకి తలనొప్పి.. కేసీఆర్ ప్రశాంతం