Home breaking news KCR Politics : ఎలక్షన్ పాలిట్రిక్స్​లో అందనంత ఎత్తుకు కేసీఆర్

KCR Politics : ఎలక్షన్ పాలిట్రిక్స్​లో అందనంత ఎత్తుకు కేసీఆర్

211
0
వాసాలమర్రిలో సీఎం కేసీఆర్​

రెగ్యులర్​ పాలిట్రిక్స్​ వేరు.. ఎలక్షన్​ పాలిట్రిక్స్​ వేరు. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలిచి.. పవర్​ చేజిక్కించుకోవడం.. ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడమే ఎలక్షన్​ పాలిట్రిక్స్​. ఈ పాలిట్రిక్స్​ను ​  కరెక్ట్​గా అర్థం చేసుకున్న కేసీఆర్​.. సక్సెస్​ అవుతున్నాడు. దుబ్బాక, జీహెచ్​ఎంసీలో ఓడిపోయారుగా అనొచ్చు. అతి విశ్వాసంతో అక్కడ ఓడిపోయాడు కాబట్టే.. తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలిచి నిలిచాడు. ఈ ఎలక్షన్​ పాలిట్రిక్స్​లో సక్సెస్​గా నిలుస్తూ ప్రతిపక్షాలకు అందనంత ఎత్తుకు వెళ్లాడు.  ఇప్పుడు అందరి దృష్టి హుజురాబాద్​ ఉప ఎన్నికలపైనే. ఈ ఎన్నికల్లో గెలిచితీరాల్సిన అత్యవసర పరిస్థితి కేసీఆర్​ది. అందుకే సీరియస్​గానే తీసుకున్నాడు.  దళితబంధు అనే స్కీం ప్రవేశపెట్టాడు. ఈ స్కీం దెబ్బకు ప్రతిపక్షాలకు కండ్లు బైర్లు కమ్మేశాయి. ఇదంతా ఎన్నికల కోసమే అంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు. కొందరు ఎన్నికల కమిషన్​కు వెళ్లడం జరిగిపోయాయి.

ఈ పరిణామల క్రమంలో తాను దత్తత తీసుకున్న యాదాద్రి జిల్లా వాసాలమర్రి అనే చిన్న ఊరిలోని 76 కుటుంబాలకు ఈ దళితబంధు స్కీం అమలు చేస్తున్నట్టుగా ప్రకటించాడు.  7.60 కోట్ల రూపాయలు కూడా రిలీజ్​ చేశారు. అంటే స్టేట్​ లెవల్లో దళితబంధు స్కీం అఫిషీయల్​గా ప్రారంభమైనట్టే. ఒక్క హుజురాబాద్​ కోసమే అంటూ గాయిగాయి చేస్తున్న ప్రతిపక్షాలను ఈరకంగా దెబ్బకొట్టేశాడు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చినా..  దళితబంధు స్కీంను హుజురాబాద్​లో అమలు చేయొచ్చు. అంటే అఫిషియల్​గా ఇంటికి 10 లక్షలు బహిరంగంగానే ఇస్తూ 40 వేల ఎస్సీల ఓట్లు కొనేయొచ్చు. ఎన్ని నీతులు చెప్పుకున్నా.. పది లక్షలంటే ఎవరికి చేదు. ఓటింగ్​ టైముకు కొందరికి అందకున్నా.. స్కీమే కాబట్టి తరవాత వస్తాయని చెప్పొచ్చు. . టీఆర్​ఎస్​ అభ్యర్థి గెలవకుంటే.. ఈ పది లక్షల స్కీం ఆగిపోతుందని క్యాడర్​తో ప్రచారం చేయొచ్చు. నోటిఫికేషన్​ కంటే ముందుగానే.. రాష్ట్రంలో స్కీం అమలు ప్రారంభమైంది కాబట్టి.. ఎన్నికల కమిషన్​ కూడా ఏం చేయలేదు. అప్పుడెప్పుడో ఇస్తానని చెప్పిన 57 ఏండ్లు ఉన్నోళ్లకు పించన్.. అమలు చేస్తున్నట్టు ప్రకటించేశాడు.  ఇదో ఓట్ల కొనుగోలు స్కీం. లొల్లి పెట్టడం తప్ప ప్రతిపక్షాలు ఏం చేయలేవు. చేసే అవకాశం అంతకన్నా లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here