2023లో అధికారంలోకి రాగానే.. కేసీఆర్ ఫాంహౌజ్‌ను లక్ష నాగండ్లతో దున్నిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రగతిభవన్‌ను కూడా నేలమట్టం చేస్తామని ప్రకటించారు. ‘బడుగుల ఆత్మ గౌరవ పోరు’ సభలో ఆయన మాట్లాడారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు
దేశంలో సామాజిక న్యాయం బీజేపీ వల్లే సాధ్యం. కేంద్రంలో 81 మంది మంత్రులుంటే 27 మంది ఓబీసీలకు, 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలకు, 5 గురు మైనారిటీలకు స్థానం కల్పించిన ఘనత నరేంద్ర మోదీ గారిదే.
ఈ దేశంలో బీసీ వ్యక్తిని ప్రధానిగా, ఎస్సీని రాష్ట్రపతిగా నియమించిన ఘనత బీజేపీదే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా బీజేపీవల్లే సాధ్యమైంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేస్తూ కేసీఆర్ సాగిస్తున్న దుర్మార్గాలను తెలియజేసి ప్రజలను చైతన్యపర్చేందుకే ‘బడుగుల ఆత్మ గౌరవ పోరు’ చేస్తున్నం.
తెలంగాణలో 2023లో అధికారంలోకి రావడం ఖాయం. వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ను, ఫాంహౌజ్ ను లక్ష నాగళ్లతో దున్ని ఆ భూములను పేదలకు పంచడం ఖాయం.
పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న కేసీఆర్ మాట తప్పిండు. పంట చేతికొచ్చిన తరువాత ఫారెస్టు అధికారులను పంపి పంటనను నాశనం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్.
ముఖ్యమంత్రి తక్షణం పోడు భూముల సమస్యను పరిష్కరించాలి. అందుకోసం ఎంతవరకైనా పోరాడేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నరు.
హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు ‘దళిత బంధు’ పేరిట ఒక్కో దళితుడికి రూ.10 లక్షలిస్తానని కేసీఆర్ మాయ మాటలు చెబుతుండు.
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న మాట ఎప్పుడో మర్చిపోయిండు. నిజంగా దళితులకు ఇచ్చే రూ.10 లక్షలతో ఇప్పుడు ఒక్క ఎకరం భూమి కూడా రాదు. మరి దళితులకు మూడెకరాల భూ పంపిణీ హామీ అమలు చేయాలంటే…..ఒక్కో దళితుడికి రూ.30 లక్షలకుపైగా ఇవ్వాలి.
ఒక్కో దళితుడికి డబుల్ బెడ్రూం ఇవ్వాలంటే రూ.10 లక్షలు కావాలి. ప్రతి ఒక్క దళితుడికి ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ హామీ అమలైతే ఈపాటికే ఒక్కో దళిత కుటుంబం రూ.10 లక్షలు సంపాదించుకునేవారు. ఈ లెక్కన తెలంగాణలో ఒక్కో దళితుడికి రూ.50 లక్షలు ఇవ్వాలి.
దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పి రాష్ట్రాన్ని పాలిస్తుండు. నిజానికి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడు సీఎం పదవికి అర్హుడు కాదా?
అంబేద్కర్ ను అవమానించిన మూర్ఖుడు, అంబేద్కర్ విగ్రహం పెట్టకుండా మోసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్.
మాట ఇస్తున్నా…..బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై అదే ప్రగతి భవన్ లో తొలి సంతకం చేస్తాం.
హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటుకు ఎన్ని లక్షలు ఇచ్చినా, మరెన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది బీజేపీయే.
కేసీఆర్ కు సవాల్ చేస్తున్నా ఈటల రాజేందర్ బావ మరిది ఫేక్ ఐడీ తయారు చేస్తే తక్షణమే విచారణ కమిటీ వెయ్. ప్రభుత్వం నీదే కదా….ఎందుకు అరెస్టు చేయలేదు?
బీసీలను మోసం చేస్తున్న దుర్మార్గపు సీఎం కేసీఆర్. బీసీల ఆత్మగౌరవ భవనాలు ఏమైనయ్. ఎంబీసీ కార్పొరేషన్ ఏమైంది?
గొల్ల కుర్మలకు గొర్రెలు ఇస్తానన్నావ్? ఎందుకు ఇస్తలేవు. కులాల పేరిట జనాన్ని చీల్చుతున్న వ్యక్తి కేసీఆర్.

ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అతి త్వరలోనే 10 వేల మంది కళాకారులతో డప్పులు మోగించి ప్రగతి భవన్ ను గడగడలాడిస్తం.
పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ఎంపీ సోయం బాబూరావు, ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నం.
నిరుద్యోగుల సమస్యలపై లక్షలాది మంది నిరుద్యోగులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచబోతున్నం.
24 గంటల దీక్ష పేరిట ఢిల్లీలో ధర్నా చేస్తానన్న కేసీఆర్ 3 గంటలకు మించి చేయలేక చేతులెత్తేసి ఇంటికిపోయి పెగ్గు లేసుకుంట కూర్చుండట. ఇది మీడియా వాళ్లే చెప్పిండ్రు. చివరకు బలవంతం చేస్తే వెళ్లి దొంగ దీక్ష చేసిన వ్యక్తి కేసీఆర్.
ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేని దుర్మార్గుడు కేసీఆర్ రాష్ట్రాన్ని ఏలుతుండు.
బాన్సువాడలో పోలీసులు బీజేపీ కార్యకర్తలను, హిందూ సంస్థల కార్యకర్తలను చిత్ర హింసలు పెడుతుండ్రు. అందుకే బాన్సువాడలో బంద్ కు పిలుపునిస్తుండ్రు.
కేసీఆర్ దుర్మార్గపు పాలనను అంతమొందిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల సమస్యలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం కోసం బీజేపీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేయబోతోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేకి కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణను విముక్తి చేయడమే బీజేపీ లక్ష్యం.