Home breaking news Whales : గాశారం గాండ్ మార్తే.. ఒడ్డున తిమింగలాలు

Whales : గాశారం గాండ్ మార్తే.. ఒడ్డున తిమింగలాలు

205
0

గాశారం గాండ్​ మారితే. ఖుదా క్యా కర్తా.? అనేది వినే ఉంటారు. ఫాఫం చైనా తిమింగాల గాసారం కూడా బాగాలేనట్టుంది. ఎప్పుడూ సముద్రంలోనే తిరుగుతూ  నోటికందిన ఆహారాన్ని కరుచుకొని బతికే ఈ తిమింగాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇది చైనాలోని ఝీజియాంగ్‌ రాష్ట్రంలోని టౌమెన్‌గాంగ్‌ సముద్ర తీరంలో జరిగింది. ఓ డజను తిమింగలాలు ఇసుక తిన్నెల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. లిన్హాయ్‌ సిటీలోని బీచ్‌లో ఒడ్డుకు దూరంగా వచ్చిపడ్డ తిమింగలాలు ఉన్నాయని అక్కడి పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే మత్య్సశాఖ, సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు ఆ ప్రదేశానికి వెళ్లి, వాటిని కాపాడే చర్యలు చేపట్టారు.

ఎండలు బాగా కాస్తుండటం.. పైగా సముద్రతీరం కాబట్టి మరింత వేడి. ఈ కొట్టుకొచ్చిన తిమింగలాలు మామూలుగా లేవు. చాలా బరువుగా ఉండటంతో పాటు  సముద్ర తీరానికి దూరంగా కొట్టుకుని వచ్చాయి. దీంతో వాటిని కాపాడేందుకు చేస్తున్న చర్యలు సరిగా ఫలితానిస్తలేవు. తిమింగలాలు వేడిని తట్టుకోవడం కోసం వాటి చుట్టూ గుంతలు తీసి., అందులో నీళ్లు పోయడంతో పాటు శరీరాన్ని తడిగా ఉంచేందుకు చల్లటి గుడ్డలు కప్పుతున్నారు. పైగా తాత్కాలికంగా షెడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా చేస్తున్న కొట్టుకొచ్చిన 12 తిమింగాలాల్లో ఓ మూడు ఇప్పటికే చనిపోయాయి. మిగిలిన వాటిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here