కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ అలక రాజకీయాలకు దిగారు. వింటే మా మాట వినండి.. ఉండమంటే ఉంటాం.. పొమ్మంటే పోతామంటున్నాడు. కాంగ్రెస్ మా మాట వినకుంటే ఫెయిలవుతుంది. పార్టీ ఫెయిలయిందంటే.. మేమూ ఫెయిలైనట్టే అంటూ బుంగమూతి పెట్టి అలక రాజకీయాల పాల్పడుతున్నారు. రాహుల్ సన్నిహితుడు, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌లో కీలక నేత జితన్ ప్రసాద..మన్మోహన్సింగ్ సర్కార్‌లో మంత్రిపదవి కూడా తీసుకున్నాడు. ఇప్పుడు పార్టీ పరిస్థితి బాగాలేదనుకున్నాడేమో.. రాహుల్ వద్దు ఏమోద్దు.. నాకు పొలిటికల్ లైఫ్ కావాలనుకుని బీజేపీలో చేరిపోయారు. జితిన్ ప్రసాద బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ సంక్షోభం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఈ సమయంలో తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ స్పందించారు. ఆయన కంటే వయసులో చిన్నదైన బీజేపీ (దాని పూర్వ రూపం జనసంఘ్) అంటే తాను పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి వ్యతిరేకమంటూ 73 ఏండ్ల కపిల్ సిబాల్ వెరైటీ కామెంట్స్ చే శాడు. పైగా ‘‘బీజేపీలో చేరడమంటే నేను చచ్చిపోయినట్లే లెక్క’ అని ఘాటుగా వ్యాఖ్యానించారాయన. ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలకు ఓ సిద్ధాంతమంటూ లేకుండాపోయిందని కామెంట్ చేసిన ఆయన, కాంగ్రెస్‌పై అలిగాడు. సీనియర్లమైన తమ వాదన వినడంలో పార్టీ విఫలమైతే తామంతా విఫలమైనట్లేనని కామెంట్ చేసిన ఆయన.. వద్దనే వరకూ కాంగ్రెస్ పార్టీతోనే తాము ఉంటామంటూనే.. ఒకవేళ అక్కర్లేదు వెళ్లిపొమ్మని పార్టీ చెప్తే.. వెళ్లిపోతామని అలకపూనాడు. అప్పుడెప్పటి రాజకీయాల్లో లీడర్ అలక పాన్పుఎక్కితే అందరూ బతిమాలాడే వారు. ఇప్పుడంత సీన్ లేదు సిబాల్ తాత.. తమరు పోతే.. ఇంకొకరు అన్నట్టుగా ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి. అయినా ఇటువంటి వాళ్లను కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని చూసిందో లెక్కేలేదు సుమా.