భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషనల్ లిమిటెడ్(ఎన్‌ఎండీసీ) పలు కేటగిరిల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారి నుంచి అప్లికేషన్లు కోరుతోంది.
వివిధ కేటగిరిల కింద 59 ఖాళీలు ఉన్నాయి. వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–16, టెక్నీషియన్ అప్రెంటిస్–13,ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్–30.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: అర్హత: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్–ఎలక్ట్రానిక్స్, మైనింగ్ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. శాలరీ: నెలకు రూ.20,000
టెక్నీషియన్ అప్రెంటిస్: అర్హత: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్–టెలీకమ్యూనికేషన్, మైనింగ్, మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. శాలరీ: నెలకు రూ.20,000
ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్:అర్హత: కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా)లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రెయినింగ్(ఎన్‌సీవీటీ) జారీచేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. శాలరీ: నెలకు రూ.10,000
అర్హుల ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
June 16 నాటికి EMail ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. E Mail: ld5hrd@nmdc.co.in
ఫుల్ డిటైల్స్కు: www.nmdc.co.in
Share this Article