Home breaking news యుద్ధానికి సారు రెఢీ.. కత్తి.. ఢాలు.. సిద్ధం చేయండి

యుద్ధానికి సారు రెఢీ.. కత్తి.. ఢాలు.. సిద్ధం చేయండి

344
0

మూడు నెలలంటే పెద్ద టైమేమీ కాదనుకో  కానీ రోజుల లెక్క చూసుకుంటే అటుఇటుగా ఓ వంద రోజులు. మధ్యలో ఒకసారి అన్నట్టు గుర్తు కానీ కుక్కలు గిక్కలు నశం నశం చేస్తా అనేసరికి యుద్ధం మాట అందరూ మరిచిపోయారులే. అయినా ఇంత తక్కువ టైంలో కేసీఆర్​ సార్​కు యుద్ధరంగం గుర్తుకొచ్చింది. యుద్ధం అంటే సార్​కు మహా సరదా. ఎప్పుడెప్పుడు చేద్దామా..? అని చూస్తుంటే టైమే కలిసి రావడం లేదు. పక్కనున్నోళ్లు కత్తి ఢాలు ఇవ్వడంలో లేట్​ చేస్తున్నట్టున్నారు. అప్పుడెప్పుడో తెలంగాణ మూమెంట్​లో యుద్దం చేశారుగా వాడక చాల్రోజులవుతున్నది. అందుకే అవి తుప్పుపట్టినట్టున్నాయి. లేకుంటే ఎప్పుడో ఇచ్చేవాళ్లు. సారు యుద్ధమనడం.. వీళ్లు కత్తి.. ఢాలు తెచ్చిచ్చే సరికి మూడ్​ పోతున్నట్టుంది.

అప్పుడెప్పుడో అంటే జస్ట్​ పోయినేడాది జీహెచ్​ఎంసీ ఎన్నికల టైంలో ఎల్బీ స్టేడియంలో మాట్లాడుతూ మాట్లాడుతూ సెంట్రల్​తో యుద్ధం చేస్తానని కేసీఆర్​ సార్​ అనేశాడు. పక్కనున్నోళ్లు కత్తి ఢాలు వెతికి సానబట్టించి సారు చేతికి ఇద్దామనే టయానికి ఎన్నికల రిజల్ట్​ వచ్చి తుస్సుమనిపిచ్చినట్టుంది. ఈ రిజల్ట్​తోటి సార్​కు యుద్ధమంటే మనసిరిగినట్టుంది. చత్​ అని ఫాంహౌస్​కు పోయి చెట్ల మధ్య నిమ్మలంగా ఉన్నాడు. మధ్యలే హాలియా మీటింగ్​లో.. యుద్ధమంటూ మాట్లాడుతుండగానే.. పనలేని కొందరొచ్చి ఏదో ఇవ్వబోతే సారు ఏమో అనిపిచ్చి కుక్కలు.. నశం నశం కింద నలిపేస్తా అనేప్పటికీ యుద్ధం మాట అందరూ మరిచిపోయారు సారూ మరిచిపోయిండు. మొన్నే మొన్నటికి మొన్నే.. హైదరాబాద్​, నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి మాంచీ హుషారుగా ఉన్నడు సారు. అందుకే కాంగ్రెస్​ ఫ్లోర్​ లీడర్​ భట్టి సారు అడిగిందానికి జవాబుగా అసెంబ్లీ మీటింగ్​లో కేసీఆర్​ మళ్లా యుద్ధం మాట తెచ్చేసిండు.

‘ప్రాణం పోయినా స‌రే నీళ్ల విష‌యంలో రాజీప‌డే స‌మ‌స్య ఉత్ప‌న్నం కానేకాదు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టుపై అన్ని ర‌కాలుగా ఫైట్ చేస్తా. ఏపీ సర్కారు త‌ల‌పెట్టిన రాయ‌లసీమ ప్రాజెక్టుపై స్టేలు కూడా ఉన్నాయి. జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్ కూడా స్టే ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. దాన్ని వ‌దిలిపెట్టే ముచ్చటే లేదు. రాజీప‌డే ప్రశ్నే లేదు. అవ‌స‌ర‌మైతే శాస‌న‌స‌భ స‌భ్యులంద‌రూ ఢిల్లీలో కూర్చొనైనా.. పోరాడుతాం కానీ మ‌న నీటి హ‌క్కుల విష‌యంలో రాజీప‌డే ప్రసక్తే లేదు. ఒక్క నీటిబొట్టు కూడా వదలం. అన్ని రకాలుగా ఫైట్​ చేస్తా’ అని కేసీఆర్​ సారు అనేశారు. అబ్బాసారూ చానారోజులకు యుద్ధం అదే ఫైటింగ్​ మాట తెచ్చేసిండు. అందరినీ తీసుకొనిపోతా అంటున్నడుగా ఇగ ఈసారి యుద్ధం కచ్చితంగా జరుగతదని  కత్తి ఢాలు సానపట్టించి రెడీ చేయడమే తరువాయి అని అందరూ అనుకుంటున్నారు. ఆలోపు నాగార్జున సాగర్​ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ టఫా కట్టి జానారెడ్డి సారో పొరపాటున బీజేపోళ్లో  గెలిస్తే.. యుద్దం గిద్దం జాన్తానై.  కత్తి ఢాలు మూలకు పెట్టేయ్​రా బై .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here