తాడూ బొంగరం లేనోడు లక్షా 90 మాట్లాడినా ఏం కాదు. అంటే ఎలాంటి బరువూ బాధ్యతలు లేని వ్యక్తి ఏది మాట్లాడినా దానికి విలువుండదు. అదే అన్నీ ఉన్నోడూ ఆచీతూచీ మాట్లాడాలి. అంటే బాధ్యతలు మీద ఉన్నోడు. సమస్యలు పరిష్కరించే స్థాయిలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా మాట్లాడాలన్నది పెద్దలు చెప్పిన మాట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రెండో కేటగిరికి చెందిన వ్యక్తి. ఆయన ఏం మాట్లాడిన దానికి ప్రచారము..ప్రాచూర్యమూ ఉంటుంది. అటువంటి వ్యక్తి పబ్లిక్ మీటింగ్‌లో రాజకీయ ప్రత్యర్థులపై కామెంట్ చేయడం వేరు. కానీ సమస్యలను పరిష్కరించాలని కోరిన వ్యక్తులను అందునా మహిళలను కుక్కలు.. అంటూ కామెంట్స్ చేయడం. ఇదంతా నిన్నటి (10–02–2021) నల్లగొండ జిల్లాలోని హాలియా పబ్లిక్ మీటింగ్‌లో జరిగింది.
ఆ మీటింగ్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు.. భాష కూడా సరిగా లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని కేసీఆర్‌కు వినతిపత్రాలు కొందరు మహిళలు వచ్చారు. ఇందులో రాజకీయ కోణం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. వాళ్ల నుంచి కాగితాలు తీసుకోమని పోలీసులకు చెప్పడం వరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే ఎందుకో ఆయనలోని అసహనం హద్దులు దాటింది. ‘వాళ్లు కాగితాలు పట్టుకొస్తుండ్రు.. పోలీసులు ఆ కాగితాలు తీసుకోండి..ఇచ్చారుగా బయటికి వెళ్లండి ఉంటారా ఉంటే కామ్‌గా ఉండండి.. పోలీసులూ వాళ్లను తీసుకెళ్లండి.. ఇటువంటి డ్రామాలు చాలా చూసినం.. మీలాంటి కుక్కలు చాలా ఉంటయ్’ అంటూ సీఎం కేసీఆర్ కామెంట్ చేశారు. ఇటువంటి కామెంట్స్ సీఎం పదవిలో ఉన్న వ్యక్తి చేయడం నిరసనకారులపై అందునా మహిళలపై చేయడం బాధ్యతగా లేదు. ఎవరో దారిన పోయే దానయ్య చేస్తే తాడూ బొంగరం లేనోడు చేశాడులే అంటే అనుకోవచ్చు. కానీ సీఎం పదవిలో ఉండి. మరో పదేళ్ల పాటు తానే ఉంటానని నిక్కచ్చిగా చెప్పిన కేసీఆర్ మాత్రం కుక్కలు అంటూ కామెంట్ చేయడం..