Home breaking news మెనిఫెస్టోలో ప్రత్యేక హోదా కూడా చేరిస్తే సూపర్

మెనిఫెస్టోలో ప్రత్యేక హోదా కూడా చేరిస్తే సూపర్

393
0

ఎట్ల చూసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రూటే వేరబ్బా. ఆయనే పేద్ద మేథావి అని టీడీపీ అభిమానులు కితాబిచ్చేస్తారు. చంద్రబాబు ఫీలింగ్స్​ గట్రా.. స్టైలూ​ ఇప్పటికీ తానే ముఖ్యమంత్రిని అన్నట్టుగా ఉంటాయి. చిన్నపామైనా పెద్ద కర్రతో కొట్టాలి అనుకుంటాడేమో ఆ లెవల్లోనే కళ్లు పెద్దగా తెరిచి హేం అంటూ విమర్శలు. అబ్బో ఆయన సూటు రూటు. ఇప్పుడు ఏపీలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలను చంద్రబాబు.. అసెంబ్లీ కాదు కాదు లోక్​సభ  ఎన్నికలుగా ఫీలయినట్టున్నారు. పోరాటం చేసి..చేయించి తెచ్చుకున్న పంచాయతీ ఎన్నికలు కాబట్టి.. మహోత్సాహంతో ‘పల్లె ప్రగతి– పంచసూత్రాలు’ పేరుతో మెనిఫెస్టో రిలీజ్​ చేసేశారు. ఓ గంటసేపు అమరావతిలోని ఎన్టీఆర్​ భవన్​లో క్లాస్​ పీకేశారు. తాము అధికారంలోకి వస్తే అంటూ మెనిఫెస్టోలో ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటూ వరాలు గుప్పించాడు. పంచాయతీ ఎన్నికల్లో అధికారమా! హేంటో..

సూపర్​ వరాల లీస్ట్​

–తాము అధికారంలోకి వస్తే ఫ్రీగా కరోనా వ్యాక్సిన్​

ఇది చేసేదంతా కేంద్ర ప్రభుత్వం.. దీనిలో రాష్ట్రాలకే దిక్కులేదు. ఇంక పంచాయతీలో గెలిస్తే ఉచితంగా ఇస్తడంట. వ్యాక్సిన్​ ఖరీదు రూ.1000 ఎంత మందికి ఇస్తడు. ఈ పైసలన్నీ ఎక్కడ నుంచి తెస్తడు.

–వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనీయకుండా చర్యలు

మోటార్లకు మీటర్ల ఏర్పాటు కేంద్ర తెచ్చిన చట్టాల కారణంగా ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్​ నోరు మూసుకొని కూర్చున్నారు. పంచాయతీలో అధికారం అప్పగిస్తే మీటర్లు ఎట్లా ఆపుతడో

–ప్రతి గ్రామంలో ఫ్రీ వైఫై

ఇంకా నయం.. ఇంట్లో ఉన్న పోరనికి ల్యాప్​ ట్యాప్​ ఇస్తానని చేర్చలేదు.

–ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తడంట

ఈ ప్రోగ్రాం కూడా ఈ మధ్యల్నే కేంద్రం బాధ్యత తీసుకుంది. ఇప్పటికే సర్పంచ్​లు ఏడ్చి చస్తుండ్రు. ఎక్కడి నుంచి చేస్తడు.

–నేరాలు జరగకుండా చేస్తడంట. కబ్జాలు జరగకుండా చూస్తడంట

ఊరికో పోలీస్​స్టేషన్​ పెడ్తడా ఏందీ. లేకుంటే ప్రైవేట్​ సైన్యం తయారు చేస్తడా

–ఉపాధి హామీ పని దినాలు పెంచుతడంట. కూలీ ఎప్పటికప్పుడు వచ్చేట్టు చేస్తడంట

ఓర్నాయనో ఇది కేంద్రం స్కీమే. ఈయనెట్లా చేస్తడు.

ఇట్లా చదువుకుంటా పోతే బారెడు లీస్టు హామీలు ఉన్నయి. ఈ హామీలు చదివినాయన ఒక మాటన్నడు.. అదే పంచాయతీల్లో గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెప్పిస్తే అంటే ఐపోయేదీ..? అంటూ కామెంట్​ చేశాడులే. ఏదీ ఏమైనా టీడీపీ కార్యకర్తలు అనుకుంటున్నట్టుగా నిజంగా చంద్రబాబు మేథావే అని ఈ మెనిఫెస్టో చూస్తే తేలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here