బ్లాక్మెయిల్లో రకరకాలున్నాయి. ఇవి ఎక్కువగా యువత ప్రేమలో కన్పిస్తాయి. ప్రేమించకుంటే చంపుతా.. అని ఒకరు. చచ్చిపోతా అని మరొకరు. మనిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో పెడతా అని ఇంకొకరు. ఈ తరహా బ్లాక్మెయిల్ ప్రేమ ఎక్కువగా మగవాళ్లు చేస్తారు. ప్రేమ తర్వాత పెళ్లి విషయంలోనూ ఇదే విధంగా బ్లాక్మెయిల్ ఉంటుంది. కాకుంటే ఇది ఎక్కువగా లేడీస్ నుంచి వస్తుంది. ఎందుకంటే అవసరం తీరిన తర్వాత ముఖం చాటేయడం మగవాళ్లలో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇందుకు ఎన్నో నిదర్శనాలు… కాకుంటే తాజా సంఘటన ఒకటి హైదరాబాద్ పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధీనా నగర్‌లో ప్రేమించావ్.. పెళ్లి చేస్కో అని ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతిని సోదరుడితో కలిసి దారుణంగా హత్య చేశాడు. ప్రియుడి ఇంటికి వెళ్లిన రాధిక.. ప్రేమించావు పెళ్లి చేస్కో అని ముస్తాఫాను నిలదీశారు. ఈ క్రమంలో ముస్తాఫా కుటుంబ సభ్యులకు, రాధికకి మధ్య గొడవ జరిగింది. అర్థరాత్రి తర్వాత ముస్తాఫా, అతని సోదరుడు జమిల్ కలిసి రాధికని దారుణంగా హత్య చేశారు. కేసులు.. అరెస్ట్‌లు జరిగిపోయింది. రాధిక తన కంటే ఐదేళ్లు చిన్నవాడైన ముస్తాఫాను ప్రేమించింది. అందుకే ప్రేమ గుడ్డిది.. పిచ్చిది.. వెర్రిది అని కూడా అంటారనుకో..
విషయానికొస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వచ్చే నెలలో అమెరికాలో ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదని సంకేతాలు అందినట్టున్నాయ్. అందుకే బ్లాక్‌మెయిల్‌కు దిగేశాడు. అప్పట్లో నేను గెలవడం మీకే అవసరమంటూ కామెంట్స్చేశారు. ఇప్పుడేమో నేను ఓడిపోయితే అమెరికా విడిచి వెళ్లి పోతానేమో అంటూ ఓటర్లను ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారు. అమెరికాలో కరోనా కారణంగా అనేక మంది ప్రజలు మరణించడం, దేశ ఆర్థిక పరిస్థితి దిగజరడం, వర్ణ వివక్ష, అశాంతి సహా మరికొన్ని ట్రంప్‌నకు ప్రతికూలంగా మారుతున్నాయంట. దీంతో ఓటర్లను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి కామెంట్లు చేస్తున్నారు. జార్జియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. ‘ఎన్నికల్లో నా పరిస్థితి అంత బాగా లేదు. ఓడిపోతే నేను ఏం చేస్తానో మీరు ఊహించ గలరా.? అమెరికా విడిచి వెళ్లిపోతానేమో! నాకు కూడా తెలియదు’అని అన్నారు. ట్రంప్ స్టేట్మెంట్ వింటున్న వాళ్లందరూ ఫాఫం ఓడిపోతానని తెలిసినట్టుంది అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.