Home breaking news వానాకాలంలో చైనాకు ఉక్కపోత –ఏసీలపై నిషేధం

వానాకాలంలో చైనాకు ఉక్కపోత –ఏసీలపై నిషేధం

414
0

తీటపనులు చేయకురా.. తీటోడా.. తాట తీస్తారు అంటే బుద్ధిమంతులుగా మారాలనుకునే వారైతే వింటారు. తీట పనులు మాననుపో అంటే.. టైం చూసి వాతలు పెడతారు. ఇది చైనాకు సరిగ్గా సరిపోతుంది. వాస్తవాధీన రేఖ వెంబడి.. తరచూ ఘర్షణలకు దిగుతున్న చైనాకు నడీ ఎండాకాలంలో  భారత్​ సురుకులు పెట్టడం స్టార్ట్​ చేసింది. ఈ సురుకుల మంటల తాలూకు బాధను చైనా మరవకముందే..  వానాకాలంలో పొగపెట్టింది మోదీ సర్కారు. ఈ దెబ్బకు చైనాకు ఉక్కపోత మొదలైంది.  మొదట్లో యాప్​లపైనే నిషేధం పెట్టిన సంగతి తెలిసిందే. అయినా చైనా తన బుద్ధి మార్చుకోలేదు. తీట పనులను చేయడం ఆపడం లేదు. అందుకే తాజాగా మరో గట్టి షాక్ ఇచ్చింది. రిఫ్రిజిరెంట్స్‌తో కూడిన ఎయిర్ కండిషనర్ల దిగుమతులపై నిషేధం విదించింది. దీనివల్ల చైనాకు ఎదురు దెబ్బ తగలడంతోపాటు భారత దేశ పారిశ్రామిక రంగానికి  ప్రోత్సాహం లభిస్తుంది.

ఈ మేరకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి  ఆమోదం రావడంతో  డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం, రిఫ్రిజిరెంట్స్‌తో కూడిన ఎయిర్ కండిషనర్లు, స్ప్లిట్ ఏసీ సిస్టమ్స్ దిగుమతిపై నిషేధం విధించారు. వీటిని ”ఫ్రీ” కేటగిరీ నుంచి ”ప్రొహిబిటెడ్” కేటగిరీలోకి మార్చారు. ఇటీవల టెలివిజన్ సెట్ల దిగుమతులపై కూడా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దేశంలో చైనా ఎయిర్ కండిషనర్లకు విపరీతమైన గిరాకీ ఉంది. 5 నుంచి 6 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. చైనా ఏసీలపై నిషేధం విధించింది కాబట్టి… ఆత్మనిర్భర్ భారత్‌ పథకానికి అనుగుణంగా స్థానిక తయారీదారులు ఏసీల ఉత్పత్తిని పెంచవలసి ఉంటుంది. పదే పదే తీట పనులు చేస్తున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం  సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుపుతూనే, ఆర్థిక రంగంలో కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది. చైనీస్ మొబైల్ యాప్‌లపై నిషేధం విధించడం, చైనా నుంచి రకరకాల వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విదించడం వంటి చర్యలు చేపట్టింది. ఈ చర్యల వల్ల ఈ ఏడాది ఏప్రిల్-–ఆగస్టు మధ్యలో, గత ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే, చైనా నుంచి దిగుమతులు 27 శాతం తగ్గాయి. అందుకే అంటారు చెడపకురా.. చెడేవు అని వినదు కదా చైనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here