Home breaking news 8 భాషల్లో TV 36 – TV9 రవి ప్రకాశ్ మళ్లీ రంగ ప్రవేశం

8 భాషల్లో TV 36 – TV9 రవి ప్రకాశ్ మళ్లీ రంగ ప్రవేశం

767
0

8 భాషల్లో కొత్త టీవీ న్యూస్​ ఛానల్​ రానుంది. దాని పేరు టీవీ 36. ఈ టీవీ 36కి కర్త, కర్మ, క్రియ పూర్తిగా టీవీ 9 బ్రాండ్​ ఆంబాసిడర్​ రవి ప్రకాశ్. ఆయన వెనుక ఉండి బీజేపీ నడిపిస్తోందని ఒక ప్రచారం జరుగుతోంది. ఈ టీవీ 36 తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, గుజరాత్​, మరాఠీ, ఒరియా వంటి భాషల్లో రానుంది. దీని కోసం రవి ప్రకాశ్​ అప్పుడే తన అనుకున్న వారిని పిలిపించుకున్నారని తెలుస్తోంది. మొదట్లో రవి ప్రకాశ్​తో ఉన్న సీనియర్​ టీవీ యాంకర్​ జకీర్​ వంటి వారితో పాటు ఇటీవలీ కాలం వరకూ మోజో, టీవీ 1, టీవీ 9 ఛానల్లో పని చేసిన తన వారిని రప్పించుకోవడమో.. చర్చలు జరపడమో జరిగిపోయింది.

తన ఛానల్​కు 36 అని పెట్టడంలో గూఢార్థం ఒక్కటే. అది తన అదృష్ట సంఖ్య 9 కలిసి వచ్చే విధంగా ఉంటుందన్నదే కారణం. రవి ప్రకాశ్​ ఏంటీ.. ఈ నమ్మకాలేంటీ అనుకుంటున్నారేమో..? ఎంత వారైనా కాంతదాసులే అన్నట్టుగా.. ఎటువంటి వారికైనా నమ్మకాలు ఉంటాయి. న్యూమరాలజీని నమ్ముతారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకూ బీజేపీకి రవి ప్రకాశ్​ వ్యతిరేకమన్న ముద్ర ఉన్నది. కానీ ఈ టీవీ ఛానల్​ వెనుక అదే పార్టీకి చెందిన వారున్నారని ప్రచారం జరుగుతోంది.

ప్రముఖ టీవీ యాంకర్ అర్నాబ్​ గోస్వామీ నడిపిస్తున్న రిపబ్లిక్​ చానల్​ వెనుక బీజేపీ ఉన్నదన్న సంగతి అందరికీ ఎరికే. కానీ ఎక్కడా బీజేపీ వాళ్లు ఉన్నారన్నట్టుగా కన్పించదు. ఆ ఛానల్​కు కావాల్సిన సహకారం మాత్రం అందిస్తారు. ఇప్పుడు టీవీ 36కు కూడా అదే విధంగా సహకారం అందిస్తామని బీజేపీ పై స్థాయి నాయకుల నుంచి హామీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. దసరా నాటికి లేకుంటే డిసెంబర్​లోపు ఈ ఛానల్​ రంగ ప్రవేశం చేయనుంది. ఎవరు ఛానల్​ పెడితే మాకేంటీ..? 8 భాషల్లో ఛానల్​ వస్తుందంటే.. ఒక్కో భాషకు తక్కువలో తక్కువగా 500 మందిని లెక్కేసుకున్నా.. కనీసం 4 వేల మందికి ఉపాధి కలుగుతుంది. మంచిదేగా స్వాగతిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here