Home తాజా వార్తలు *28 డిగ్రీస్ సెల్సీయస్* టీజర్ విడుదల

*28 డిగ్రీస్ సెల్సీయస్* టీజర్ విడుదల

123
0

నవీన్ చంద్ర హీరోగా షాలిని వడ్నికట్టి హీరోయిన్ గా డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్ సైడ్ సినిమాస్ పతాకాలపై సాయి అభిషేక్ నిర్మిస్తోన్న చిత్రం “28 డిగ్రీస్ సెల్సీయస్”. ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో సుమంత్, అడవి శేష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సుమంత్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా, అడవి శేష్ చిత్ర టీజర్ ని లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ చంద్ర, హీరోయిన్ షాలిని వడ్నికట్టి, దర్శకుడు అనిల్ విశ్వనాథ్, నిర్మాత సాయి అభిషేక్, ఎడిటర్ గారి బిహెచ్, కెమెరామెన్ వంశీ పచ్చిపులుసు, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, నటులు రాజా రవీంద్ర, వివ హర్ష, నటీమణులు దేవియాని శర్మ, సంతోషి శర్మ తదితరులు పాల్గొన్నారు.

సుమంత్ మాట్లాడుతూ.. ఒకసారి ఈ సినిమా లైన్ చెప్పాడు. అంతగా ఎక్కలేదు..కానీ టీజర్ చూశాక బాగా నచ్చింది. ఆడియెన్స్ కి రీచ్ అవుతుంది అనిపించింద‌న్నారు. అడవి శేష్ మాట్లాడుతూ సినిమా సక్సెస్ అయి టీమ్ అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నానని అన్నారు. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ… అరవింద సమేత లో బాల్ రెడ్డి క్యారెక్టర్ నాకు మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అనిల్, అభిషేక్ వచ్చి నాకు కథ చెప్పారు. చాలా బాగుంది. టీమ్ అంతా మనసు పెట్టి వర్క్ చేశారు. వెరీ ఇంటెన్సివ్ లవ్ స్టోరీ. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంద‌ని తెలిపారు. దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్, నిర్మాత సాయి అభిషేక్ మాట్లాడుతూ… ఇదొక సస్పెన్స్, లవ్ థ్రిల్లర్, ఇంటెన్స్ స్టోరీ. నవీన్, షాలిని అందరూ సూపర్బ్ గా యాక్ట్ చేశారు. సినిమాని మే లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామ‌ని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here