Home breaking news 22న *లక్ష్మీస్ ఎన్టీఆర్*.. కుట్ర‌ల చిత్రం

22న *లక్ష్మీస్ ఎన్టీఆర్*.. కుట్ర‌ల చిత్రం

159
0

వివాద‌స్ప‌ద‌, విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మ‌రో చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ అస‌లు క‌థ‌. ఈ సినిమాకు ట్యాగ్‌లైన్‌ ఇది కుట్ర‌ల (కుటుంబ‌) చిత్రంలో వెన్నుపోటు ప‌ర్వం గా వ‌ర్మత‌న పోస్ట‌ర్‌పై ఏర్పాటు చేశారు. ఈ ట్యాగ్‌లైన్ చూసే చెప్పొచ్చు.. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌లో భాగంగా ఆయ‌న‌ కుమారుడు బాల‌క్రిష్ణ న‌టించిన క‌థానాయకుడు, మ‌హానాయ‌కుడుకు కొన‌సాగింపుగా మూడో భాగంగా చూడొచ్చు. ఆ రెండు సినిమాల్లో సినిమా నుంచి ఎన్టీఆర్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌డం అనంత‌రం కేంద్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం,. ఎన్టీఆర్‌ను అధికారంలోంచి దించివేయ‌డం, ఆ త‌రువాత తిరిగి ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీని చేప‌ట్ట‌డం వ‌ర‌కూ చూపించారు. మ‌హానాయ‌కుడు చిత్రంలో ప్ర‌ధానంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాత్ర‌ను ఎక్కువ‌గా చూపెట్టారు. ఈ రెండు సినిమాలు వ‌చ్చే ఎన్నిక‌లు దృష్టిలో పెట్టుకొని తీయ‌డం, వాటి ద్వారా ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొంద‌డ‌మే ఉద్దేశంగా తీశారు. అయితే ఈ రెండు సినిమాలు బొక్కా బోర్లా ప‌డ్డాయి. ఈ రెండు సినిమాలు దాదాపు తెర‌మ‌రుగయ్యాయి. వ‌ర్మ తీసిని లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందు విడుద‌ల‌వుతోంది.

22న విడుద‌ల‌
ఎన్టీఆర్ రాజ‌కీయ‌ జీవితంలో చంద్ర‌బాబు వెన్నుపోటు పోడిచిన అంశాన్ని ప్రధానంగా తీసుకొని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ చిత్రం రూపొందించారు. జీవీ ఫిల్మ్స్ పతాకంపై రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమాను మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ విషయాన్ని వర్మ త‌న ఫేస్‌బుక్‌తో పాటు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు వ‌స్తున్న ఈ చిత్రం ఎక్కువ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కాకుంటే.. సినీ రంగంపై ప్ర‌భావం చూపే చంద్ర‌బాబు.. థియేట‌ర్లు దొరక‌కుండా చేసే అవ‌కాశ‌ముంద‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. తెలంగాణ‌లో థియేట‌ర్లు ల‌భించే సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఏపీలోని థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌కుండా చూసే అవకాశ‌ముంద‌న్న ప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమా హ‌క్కులు ఎవ‌రికీ ల‌భించాయే మాత్రం వ‌ర్మ బ‌య‌ట‌పెట్ట‌లేదు. అన్ని అంశాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రం ట్రైల‌ర్‌, తొలి పాట‌కు విప‌రీత‌మైన స్పంద‌న వ‌చ్చింది. సినిమాకు ఎలాంటి స్పంద‌న వ‌స్తుంద‌నేదీ.. విడుద‌ల‌యితే కానీ తెలియ‌దు. ఈ సినిమా బాల‌క్రిష్ట న‌టించిన క‌థ‌నాయ‌కుడు, మ‌హానాయ‌కుడు మాదిరిగా మాయ‌మ‌వుతుందా..? ప్రేక్ష‌కుల ముఖ్యంగా రాజ‌కీయ ప్రేక్ష‌కుల ఆధ‌ర‌ణ పొందుతుందా.. చూడాలి.


ఎన్టీఆర్ హ‌యాంలో..
ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌కు సినిమా రంగంతో పాటు రాజ‌కీయంగా బ‌ద్ద విరోధిగా ఉన్న ప్ర‌ముఖ నటుడు కృష్ణ వ‌రుస‌గా రాజ‌కీయ సినిమాలు నిర్మించారు. మండ‌లాధీశుడు, గండిపేట ర‌హ‌స్యం, నా పిలుపే ప్రభంజ‌నం వంటి సినిమాలు రూపొందించి విడుద‌ల చేశారు. ఈ సిన‌మాలో ఎన్టీఆర్ పాత్రలో ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టీస్ట్, బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోట శ్రీనివాస‌రావు న‌టించారు. అప్ప‌ట్లో ఈ సినిమాలు ఉమ్మడి రాష్ట్రంలో సంఛ‌ల‌నం క‌ల్గించాయి. ఇప్పుడు అదే కోవ‌లో ఎన్టీఆర్‌ను రాజ‌కీయంగా వాడుకోవ‌డానికి రాజకీయ చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here