Home breaking news హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నానికి వెళ్లినందుకు – అంతు చూస్తామంటున్నారు

హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నానికి వెళ్లినందుకు – అంతు చూస్తామంటున్నారు

159
0
హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నానికి వెళ్లినందుకు - అంతు చూస్తామంటున్నారు
ఇష్ర‌త్ జ‌హాన్ (సోష‌ల్ మీడియా ఫొటో)

ఒక హిందువు మ‌సీదు కు లేదా చ‌ర్చీకి వెళ్లి ప్రార్థ‌న‌ల్లో పాల్గొంటే.. అది లౌకిక‌వాదం. స‌మానత్వం. మైనార్టీల‌కు ఈ దేశంలో భ‌యం లేదు. ఇవే మాట‌లు లౌకిక‌వాదం పేరు చెప్పే పార్టీలు వ‌ల్లె వేస్తాయి. ఇత‌ర మ‌తానికి చెందిన చిత్ర‌కారుడు.. హిందూ దేవుళ్ల ఫొటోల‌ను అస‌భ్యంగా వేస్తే.. అది క‌ళ‌కు వ‌న్నె తేవ‌డం. దీని గురించి ఎవ‌రైన నోరు తెరిస్తే.. అది క‌ళ‌.. రా బాబూ.. మ‌తం కోణంలో చూడొద్దు అని ఇవే లౌకిక‌వాదం పేరు చెప్పే రాజ‌కీయ పార్టీలు. వీళ్లు చెప్పిన‌ట్టే ఇవ‌న్నీ లౌకిక‌వాద‌మైతే.. ఒక ముస్లిం మ‌హిళ‌.. హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నానికి వెళ్తే.. లౌకిక‌వాదమే క‌దా.

ఇప్పుడు విష‌యానికొద్దాం. కోల్‌క‌తాకుచెందిన బీజేపీ నేత‌, ట్రిపుల్ త‌లాఖ్ పిటీష‌న‌ర్ ఇష్ర‌త్ జ‌హాన్ హిజాబ్ ధ‌రించి హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నానికి హాజ‌ర‌య్యారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న ఆమె సామాజిక వ‌ర్గానికి చెంద‌న వారు ఆగ్ర‌హంతో.. ఆమెను చుట్టుముట్టి.. నువ్వు చేసిన ఈ ప‌నివ‌ల్ల మ‌న స‌మాజాన్నే కించ‌ప‌రిచావు. నిన్ను బ‌త‌క‌నీయ‌మంటూ ఆమె బెదిరించారు. దీంతో ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుకున్నారు. ఆ త‌రువాత ఈ విష‌య‌మై ఆమె మీడియాతో మాట్లాడారు.

హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌న‌కు వెళ్లినందుకు త‌న బావ, ఇంటి యజమాని కూడా అసభ్యంగా దూషించారని జ‌హాన్ తెలిపారు. ఇల్లు ఖాళీ చేయ‌మంటూ బెదిరిస్తున్నార‌ని, చంపేస్తామంటూ హెచ్చ‌రిస్తున్నార‌ని చెప్పారు. ఏ క్ష‌ణ‌మైనా వారు త‌న ప్రాణానికి హాని త‌ల‌పెట్టే ప్ర‌మాద‌ముంద‌ని వాపోయారు. జ‌హాన్ ఫిర్యాదు న‌మోదు చేసుకున్న గొలాబరి పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. ఆమె లౌకిక‌వాదాన్ని.. ఆమె సామాజిక వర్గానికి చెందిన‌ వారు చుట్టుముట్టి ప్ర‌శ్నిస్తుంటే.. ఈ లౌకిక‌వాదులు క‌న‌బ‌డ‌రేం. ఎందుకు ప్ర‌శ్నిస్తున్నార‌ని నిల‌దీయ‌రేమ‌న్న ప్ర‌శ్న‌లకు ఈ లౌకిక‌వాద‌ల నుంచి స‌మాధానం రాదు. ఎందుకంటే వారికి ఓట్లు కావాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here