Home breaking news హరీశ్ పై మళ్లీ దాడి

హరీశ్ పై మళ్లీ దాడి

206
0

మాజీ మంత్రి హరీశ్ రావు పై మళ్లీ మాటల దాడి జరిగింది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. హరీశ్ పై విమర్శలు మొదలు పెట్టారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ను మాత్రం విమర్శల నుంచి మినహాయింపు ఇచ్చారు. తాజాగా హరీశ్ పై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకూ మినహాయింపు ఇచ్చిన జగ్గారెడ్డి తాజాగా కేటీఆర్, కవిత, వినోద్ కుమార్, ఈటల రాజేందర్ పై కూడా విమర్శలు చేశారు. జగ్గారెడ్డి ఏమన్నారంటే..

హరీష్ ..సింగూరు నీళ్లను తరలించినప్పుడు ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎటుపోయారు .?
హరీష్ మాత్రమే నీటిని తరలించారని నేను ఇప్పటివరకు అనుకున్న ..కానీ కేటీఆర్ ,కవిత ,వినోద్ ,ఈటెల ఉన్నారని టీఆరెస్ నేతలే అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఈ నలుగురు సమాధానం చెప్పాలి.
నేను రాజకీయాలు మాట్లాడ్డం లేదు. సంగారెడ్డి ప్రజలకు తాగేందుకు నీళ్లు లేవు. వారి కోసమే మాట్లాడుతున్నా.
ముందు నీళ్ల పంచాయితీ ఒడిసిన తర్వాత పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం.
ప్రశ్నిస్తున్న నన్ను జైల్లోనే ఉంచేందుకు హరీష్ మనుషులు ప్రయత్నం చేశారు.
ప్రజల సమస్యలు మాట్లాడితే
కేరెక్టర్ లేని వాళ్లు..నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసుకుంటున్నారు.
విమర్శలు, ఆరోపణలు చేసే వారు.. నలభై ఏండ్ల కింద నేనేంతో ..కేసీఆర్ ,హరీష్ ,కేటీఆర్ ,టీఆరెస్ నేతలు ఎలా ఉన్నారో ఒకసారి చూసుకోవాలి. నా స్టోరీ మీరు రాస్తారో ..మీ స్టోరీ లేంటో నేను ప్రజలకు చెబుతా. ప్రశ్నిస్తున్న నా పై కేసులు పెట్టిస్తారో..పోలీసులతో చంపిస్తారో ..అంతకంటే ఇంకేం చేస్తారు మీరు. హరిషను ప్రశ్నిస్తే కేసీఆర్ ను ఎందుకు తిట్టడంలేదని కొందరు టీఆరెస్ నేతలు అనడం ఆశ్యర్యం కల్గుతోంది. సింగూరు జలాల అంశంపై కేసీఆర్ జోక్యం చెసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here