Home క్రైమ్ హాజీపూర్ వ‌రుస హ‌త్య‌లు.. మూలాల మాటేమిటీ..? | Hajipur murders

హాజీపూర్ వ‌రుస హ‌త్య‌లు.. మూలాల మాటేమిటీ..? | Hajipur murders

359
0
  • వికాస్ రుషి

హ‌త్య‌లు.. హ‌త్యాచారాలు.. ఆత్మ‌హ‌త్య‌లు.. ఇవి నిత్యం జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ సంఘ‌ట‌న‌ల్లో కొన్ని ప్ర‌ముఖంగా ప్ర‌చార‌మైతే.. మ‌రికొన్ని సంఘ‌ట‌న జ‌రిగిన చోటే స‌మాధై పోతుంటాయి. ప్ర‌చారం కాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. ప‌రువు.. ఈ పేరుతోనే ఎక్కువ‌గా బాధితులు నోరు నొక్కేసుకొని కూర్చుంటారు. ఊళ్లో పెద్ద‌మ‌నుషుల పేరుతో ఛ‌లామ‌ణి అయ్యేవాళ్లు కూడా మ‌ధ్య‌వ‌ర్తులుగా వ్య‌వ‌హ‌రించి సెటిల్ చేస్తుంటారు. ఈ అత్యాచారాల మీదే.. ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి షీలా దీక్షిత్ ఇటీవ‌ల మీడియా మీద దుమ్మెత్తి పోశారు. మీ కార‌ణంగానే… నిర్భ‌య ఘ‌ట‌న దేశంలో విస్తృతంగా ప్ర‌చార‌మైంది. ఇటువంటివి ఎన్నో జ‌రుగుతున్నాయి. అన్నింటిని మీరే ప‌ట్టించుకోరు. కొన్నింటిని మాత్రం ఇలా ప్ర‌చారం చేస్తారంటూ తెగ బాధ‌పడిపోయారంట‌. ఆమె బాధ‌కు ప్ర‌ధాన కార‌ణ‌మొక్క‌టే… ఆ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో కేంద్రంలో కాంగ్రెస్‌, ఢిల్లీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరి ఉంది. అప్పుడు ఆమె ముఖ్య‌మంత్రి. ఈ కార‌ణంగా త‌న ప‌ద‌వి ఊడిపోయింద‌ని ఆమె బాధంత‌. ఇక అస‌లు విష‌యానికి వ‌ద్దాం. ఇటీవ‌ల తెలంగాణ‌లోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా హాజీపూర్‌లో ముగ్గురు బాలిక‌ల‌పై అత్యాచారం చేసి.. హ‌త్య చేసిన సంఘ‌ట‌న సంఛ‌ల‌నం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌పై వారంరోజుల‌కు పైగా మీడియాలో క‌థ‌నాలు. చివ‌ర‌కు నిందితుడు మ‌ర్రి శ్రీనివాస‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇత‌డు మ‌రికొన్ని హ‌త్య‌లు చేసి ఉండ‌వ‌చ్చు అన్న అనుమానంలో మ‌రింత విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. ఈ శ్రీనివాస‌రెడ్డి మ‌త్తు ప‌దార్ధాల‌కు బానిస‌గా మారి.. నీలి చిత్రాలు చూస్తూ ఇటువంటి వికృత‌దాడికి పాల్ప‌డ్డాడ‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. హాజీపూర్ వంటి చిన్న‌గ్రామంలో అత‌డికి మ‌త్తు ప‌దార్థాలు ల‌భించ‌డం విచిత్ర‌మే. నీలి చిత్రాల‌కు అడ్డు అదుపు లేదు. ఏ సెల్‌ఫోన్‌లో నెట్ ఆన్ చేస్తే చాలు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా వ‌చ్చేస్తాయి. వీటికి ఆక‌ర్షితుడై అత‌డు ఈ విధంగా చేశాడ‌ని ప్రాథ‌మికంగా అంద‌రూ అనుకుంటున్నారు. అత‌డు నేరం చేశాడు. నిందితుడు కూడా అంగీక‌రించాడు. కానీ నేరం చేయ‌డానికి అత‌డిని ప్రోత్స‌హించిన లేదా ప్రేరేపించిన వాటి సంగ‌తేమీటీ..? ఈరోజు ఇత‌డి నేరం రుజువూ శిక్ష పడుతుందనుకుందాం. ఈ మ‌త్తు ప‌దార్థాల‌కు బానిస అయిన మ‌రొక‌డు ఇదే విధంగా చేస్తాడు. అప్పుడు కూడా అత‌డిని ప‌ట్టుకొని శిక్షిస్తాం. కానీ వీరు ఇలా చేయ‌డానికి ప్రేరేపించిన ప‌రిస్థితులు.. కార‌ణాలు.. అన్వేషించ‌రా..? వాటి క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోరా..? ఆదాయం కోసం స‌ర్కారే ఇబ్బ‌డిముబ్బ‌డిగా మ‌ద్యం దుకాణాల‌కు అనుమ‌తిలిచ్చేసింది. ఇక సినిమాల సంగ‌తి స‌రేస‌రి. భావ ప్ర‌క‌ట‌న స్వేచ్చ‌.. పేరుతో ఇష్టమొచ్చిన‌ట్టుగా రాత‌లు. తీత‌లు. ఈ సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన ఒక ఘ‌ట‌న గుర్తుకు చేసుకుందాం.

2008 డిసెంబ‌ర్ 10న స్వ‌ప్నిక‌, ప్ర‌ణీత‌పై యాసిడ్ దాడి జ‌రిగింది. ఈ దాడికి పాల్ప‌డిన శ్రీనివాస‌రావు, సంజ‌య్‌, హ‌రికృష్ణ‌ను ఆనాటి వ‌రంగ‌ల్ ఎస్పీ స‌జ్జనార్‌ ప‌ట్టుకొని మీడియా ఎదుట‌ డిసెంబ‌ర్ 12న‌ హాజ‌రుప‌రిచారు. వారు త‌మ నేరాన్ని అంగీక‌రించారు. 13 తెల్ల‌వారుజామున జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ ఈ ముగ్గురు మృతి చెందారు. దీన్ని కొంద‌రు స్వాగ‌తించారు. మ‌రికొంద‌రు వ్య‌తిరేకించారు. ఆ త‌రువాత దాడులు ఆగాయా..? వేర్వేరు రూపాల్లో కొన‌సాగుతున్నాయి. ఇటువంటి ఘ‌ట‌న‌ల‌కు ప్రేరేపించే వాటిని అరిక‌ట్ట‌డం ద్వారా నివారించే ప్ర‌య‌త్నం చేయ‌వ‌చ్చు. అలాకాకుండా సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడే హ‌డావుడిగా విచార‌ణ త‌రువాత మ‌రిచిపోవ‌డం షరా మామూలే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here