Home Entertainment స‌మంత పారితోషికం ఎంత డిమాండ్ చేస్తుందో తెలిస్తే షాకే

స‌మంత పారితోషికం ఎంత డిమాండ్ చేస్తుందో తెలిస్తే షాకే

213
0
స‌మంత పారితోషికం ఎంత డిమాండ్ చేస్తుందో తెలిస్తే షాకే
స‌మంత

ప్ర‌ముఖ న‌టి స‌మంత త‌న పారితోష‌కాన్ని అమాంతం పెంచేశారు. పెళ్లైన త‌ర్వాత కూడా స‌మంత హీరోయిన్‌గా రాణిస్తున్నారు. మంచి విజ‌యాలు కూడా అందుకుంటున్నారు. భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన మ‌జిలీ చిత్రం విజ‌య‌వంత‌మైంది. ఇటీవ‌ల విడుద‌లైన ఓ బేబి చిత్రం సూప‌ర్ హిట్ అయింది. ఈ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు మంచి క‌థానాయ‌కి లభించింద‌న్న టాక్ కూడా వ‌చ్చింది.

ఓ బేబి చిత్రం విజ‌యంతో హుషారుగా ఉన్న స‌మంత త‌న పారితోష‌కాన్ని అమాంతం పెంచేసిందంట‌. ఇప్ప‌టివ‌ర‌కూ ఆమె రూ. 2 కోట్లు తీసుకునేద‌ని, ఇప్పుడు ఏకంగా కోటి పెంచి రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తుందంట‌. ఈ భామ ప్ర‌స్తుతం 96 రీమేక్‌లో న‌టించ‌డానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మొత్తం మీద నయనతార, అనుష్క త‌ర్వాత సమంత కూడా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల జాబితాలో చేరిపోయారు. న‌య‌న‌తార రూ. 5 కోట్లు తీసుకుంటుంటే.. అనుష్క రూ. 4 కోట్లు తీసుకుంటున్నార‌ట‌. వాళ్లిద్ద‌రికీ ఈమెకు ఉన్న తేడాల్లా ఒక్క‌టే. అది న‌య‌న‌తార‌, అనుష్క‌కు పెళ్లి కాక‌పోవ‌డం.. సమంత‌కు పెళ్లికావ‌డం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here