Home ఎడ్యుకేషనల్/జాబ్స్ స్వయం ఉపాధికి 80 నుంచి 60 శాతం సబ్సిడీతో రుణాలు

స్వయం ఉపాధికి 80 నుంచి 60 శాతం సబ్సిడీతో రుణాలు

219
0
స్వయం ఉపాధికి 80 నుంచి 60 శాతం సబ్సిడీతో రుణాలు

స్వయం ఉపాధి కల్పించడానికి క్రిష్టియన్​ మైనార్టీ ఫైనాన్స్​ కార్పొరేషన్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. అర్హులైన వారికి  రూ. లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీతో రుణాలు అందిస్తామని ప్రకటించింది. 21 నుంచి 55 ఏళ్లలోపు వారు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది.  గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల వార్షికాదాయం కలిగి ఉండాలని తెలిపింది. ఎంపికైన అభ్యర్థి పేర్కొన్న యూనిట్​కు రూ. లక్ష నుంచి 8 లక్షల వరకూ బ్యాంక్​ లింకేజీ ద్వారా మంజూరు చేస్తామని వెల్లడించింది.

రూ. లక్ష రుణానికి 80 శాతం సబ్సిడీ, రూ. 2 లక్షలకు 70 శాతం, రూ. 2 లక్షల నుంచి ఆ పై రుణాలకు 60 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తామని తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆగస్టు 24లోగా www.tsobmms,org.gov.in పంపించాలని సూచించింది. పూర్తి వివరాలకు స్థానిక మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని లేదా మండల పరిషత్ ను సంప్రదించాలని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here