Home breaking news సోనియా, ప్రియాంక రాకుండానే ఎన్నికలు ముగిసిపోయినయ్

సోనియా, ప్రియాంక రాకుండానే ఎన్నికలు ముగిసిపోయినయ్

122
0

దేశంలో అతి పెద్ద సీనియర్​ పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ అధినేత సోనియా, రాకుమారి ప్రియాంక అడుగు పెట్టకుండానే.. రెండు రాష్ట్రాల ఎన్నికలు. మరి కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ముగిసిపోయినయ్​. మహారాష్ట్ర, హరియాణ ఎన్నికల్లో సోనియా ప్రచారం చేయనే లేదు. లోక్​సభ ఎన్నికల్లో అన్నీ తానే అయిన కాంగ్రెస్​ స్టార్​ కాంపెయిన్​ ప్రియాంక అటువైపు చూడనే లేదు. ఆ పేరు ఎక్కడా విన్పించనూ లేదు. కత్తి వదిలేసిన యువరాజు రాహుల్​ బాబు మాత్రం వచ్చేశారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా పది సభల్లో పాల్గొన్నట్టున్నారు. అవతలి పక్క అధికార పార్టేమో.. అదే బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్రమోదీ 20 సభలు, హోంమంత్రి షా 30 సభల్లో ప్రచారం చేశారు. మొత్తానికి ఎన్నికలు ముగిసిపోయినయ్​. సోనియమ్మ ప్రచారానికి రాలేదు ఎందుకయ్య అంటే.. మొత్తం లోకల్​ లీడర్లే నడిపించాలన్న ఉద్దేశంతో రాలేదంటున్నారు. మరీ రాహుల్​ వచ్చాడుగా అంటే.. మీరే మరీ మరీ రమ్మని అడిగారుగా అని అంటున్నారు.

ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడెలా  చెప్పగలము కానీ.. ఈ రాకపోవడానికి.. రావడానికి మధ్య ఇక్కడ రెండు కారణాలు కన్పిస్తున్నాయి. ఒకటి గెలిస్తే.. రాహుల్​ ప్రచారం చేశారుగా అని చెప్పుకోవచ్చు. ఓడిపోతే.. మీరేగా ప్రచారం.. గట్రా మొత్తం చూసుకుంది అని నిందలేయచ్చు. మా పాత్ర ఎక్కైడైనా ఉందా..? అని అనొచ్చు. చిట్ట చివరకు మాత్రం మా ఫ్యామిలీ (గాంధీ) లేకుంటే మీకు గతే లేదు. ఇవన్నీ ఏమో గానీ ఒకటి మాత్రం నిజం. అదే లోక్​సభ ఎన్నికల్లో ఓటమి నైరాశ్యం. ఎంతో ఆశపడి.. ఆతృతగా ఎదురు చూసిన అధికారం అందనంత దూరంలోకి వెళ్లిపోయింది. అందుకే అధికారం, పదవులు ఎప్పుడూ శాశ్వతం కాదని అంటుంటారు. వెలిగినన్ని రోజులు వెలిగిపోయారు. మొదటిసారిగా పదేళ్లు అధికారానికి దూరంగా ఉండిపోతున్నారు. ఆ తరువాత.. ఏమో  2024 వరకూ అంటే అప్పటికీ రాజెవరో.. మంత్రి ఎవరో అధికారం ఎవరికో..? అన్న నిరాశ.. నిస్పృసలోకి సోనియా ఫ్యామిలీ వెళ్లిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here