Home breaking news సోద‌రి క‌ళ్ల‌లోకి చూడ‌రు అజంఖాన్ – అన్నాచెల్లెళ్లు ముద్దు పెట్టుకోరు మాంఝీ

సోద‌రి క‌ళ్ల‌లోకి చూడ‌రు అజంఖాన్ – అన్నాచెల్లెళ్లు ముద్దు పెట్టుకోరు మాంఝీ

272
0
సోద‌రి క‌ళ్ల‌ల్లోకి చూడ‌రు అజంఖాన్ - అన్నాచెల్లెళ్లు ముద్దు పెట్టుకోరు మాంఝీ
అజంఖాన్, మాంఝీ

డిప్యూటీ స్పీక‌ర్ ర‌మాదేవిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ అజంఖాన్ తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్దించుకునే ప్ర‌యత్నంలో పడ్డారు. ర‌మాదేవి త‌న‌కు సోద‌రిలాంటిద‌ని, త‌ప్పుగా మాట్లాడి ఉంటే రాజీనామా చేయడానికి కూడా సిద్ధ‌మేన‌ని అజం చెప్పుకొచ్చారు. సోద‌రిని ఎవ‌రూ క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టి చూడర‌న్న సంగ‌తి ఆయ‌న‌కు తెలియ‌న‌ట్టుంది. చిన్న‌ప్పుడు అన్నా చెల్లెళ్లు ఒక‌రిపై ఒక‌రు చేతులు వేసుకున్నా.. క‌లిసి కూర్చున్నా ఎవ‌రేం అభ్యంత‌రం చెప్ప‌రు. ఎవ‌రూ పట్టించుకోరు. ఒక వ‌య‌సుకు వ‌చ్చిన త‌ర్వాత అన్నా చెల్లెళ్లు కూడా స‌మ‌దూరం పాటిస్తార‌న్న సంగ‌తిని అజం మ‌రిచి పోయిన‌ట్టున్నారు. తాను చేసిన వ్యాఖ్య‌ల్లో ఎలాంటి భాష ఉందో గ‌మ‌నిస్తే ఆనాడే అజంఖాన్ తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పేవారు. ఇప్పుడీ స‌ర్దుబాటు వ్య‌వ‌హారం ఉండేది కాదు.

తాజాగా అజంఖాన్‌క ఒకాయ‌న మద్ద‌తుగా నిల‌బడ్డారు. ఆయ‌నే బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి జిత‌న్‌రామ్ మాంఝీ. అజంఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారంటూ కొత్త అర్థాలు చెబుతున్నారు మాంఝీ. ఇందుకు కొన్ని ఉదాహార‌ణ‌లు కూడా చెప్పుకొచ్చారు. అన్నా చెల్లెళ్లు, త‌ల్లీ కొడుకులు ముద్దు పెట్టుకున్నా.. అది లైంగిక సంబ‌ధ‌మేనా..? అంటూ కొత్త‌వాద‌న తెర‌పైకి తెచ్చారు. ఈయ‌న ముఖ్య‌మంత్రి ఎలా అయ్యాడో కానీ, ముద్దుల్లో ర‌కాలుంటాయి. నుదిటిపై ముద్దు పెట్టుకుంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు ఎవ‌రూ ఏమీ అన‌రు. అయినా వ‌యసొచ్చిన అన్నా చెల్లెళ్లు ముద్దులు పెట్టుకోరన్న సంగ‌తి మాంఝీకి తెలియ‌దేమో..? ఈ మాంఝీ అనే మాజీ ముఖ్య‌మంత్రి 2015లో జేడీయూను వీడి సొంతంగా హిందూస్తాన్‌ అవామ్‌ మోర్చా పార్టీని స్థాపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here