Home breaking news సెక్రటేరియట్లోకి జర్నలిస్టులకు నో ఎంట్రీ..! తగిన శాస్తే జరిగింది

సెక్రటేరియట్లోకి జర్నలిస్టులకు నో ఎంట్రీ..! తగిన శాస్తే జరిగింది

498
0
సీఎస్​కు వినతిపత్రం ఇస్తున్న జర్నలిస్టులు

.ఉద్యమ జర్నలిస్టు

మా రాష్ట్రం మాక్కేవాలే. ఆంధ్రోళ్ల పెత్తనం వద్దు. మావోడే మమ్ములను పాలించాలే. అనుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులను సెక్రటేరియట్​లోకి రాకుండా నిషేధం విధించారు. ఈ నిషేధంపై మనసు కాస్త చివుక్కుమన్నా.. మనకు తగిన శాస్తే జరిగినట్టు నాకూ అనిపించింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా పాల్గొన్నాం. ఆంధ్ర నాయకులు ఎక్కడ కన్పించినా.. పత్రికలకు అతీతంగా వాళ్లను పట్టి పీడించాం. ఆంధ్ర యాజమన్యాల చేతుల్లో పత్రికలు, టీవీలు ఉన్నా.. వారిని ధిక్కరించాం. ధిక్కరించినందుకు కొందరి ఉద్యోగాలు ఊడిపోయాయి. మరికొందరు స్వాభిమానంతో ఉద్యోగాలు వదులుకున్నారు.

ఉద్యమ సమయంలో కూడా అసెంబ్లీలోని లాభిల్లోకి యదేచ్ఛగా తిరిగాం. సెక్రటేరియట్​లోకి కార్డు చూపించకుండా వెళ్లగలిగాం. ఏ డిపార్ట్​మెంట్​ హెడ్​ గదికైనా వెళ్లగలిగాం. వారితో మాట్లాడగలిగాం. భయమా..? భక్తా..? తెలంగాణపై సానుభూతా ఇంకేదైనా ఉందో తెలియదు కానీ సమాచారం మాత్రం ఇచ్చేవారు. ఏదో విధంగా మనకు వచ్చేది. రాసేవాళ్లం. తెలంగాణ వచ్చింది.. ముందుగా నమస్తే తెలంగాణ పత్రికలో ఫస్టు ఫస్టు ఎడిటర్​గా ఉన్న అల్లం నారాయణ సార్​ పోస్టు పోయింది. ఏక మొత్తంలో 10 మంది జర్నలిస్టుల ఉద్యోగాలు కూడా బదిలీ పేరుతో పీకేశారు. నారాయణ సార్​కు  ప్రెస్​ అకాడమీ ఇచ్చారు కదా అనుకోవచ్చు. కానీ పోస్టులో ఆయనెంత సుఖంగా ఉన్నారో తెలుసుకుంటే విషయం తేలిపోతుంది. అదే ఆంధ్రజ్యోతి పత్రికలో ఎడిటర్​గా ఉండి తెలంగాణోద్యమంలో పాల్గొన్న శ్రీనివాస్​ సార్​ ఉద్యోగం ఇంకా ఉంది.

సెక్రటేరియట్​లో కార్డు చూపిస్తేనే రానిచ్చే పొజిషన్​కు వచ్చింది. ఒక రూమ్​కే పరిమితమయ్యాము. పైకి వెళ్లినా.. సమాచారం లేదు. ఉన్నా వారియ్యరు. అష్టకష్టాలు పడి తెచ్చినా.. ఆఫీసుకు వెళ్లి టైప్​ చేసినా.. పైకి పోదు. పోయినా తెల్లారి పత్రికలో రాదు. అసెంబ్లీ లాబిల్లోకి వెళ్లడానికి పరిమితులు. కార్డుపై లాబీ అని ఉంటేనే అనుమతి. ఇంతకు ముందు ఇది ఉన్నా..పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. యదేచ్చగా వెళ్లేవాళ్లం. సెక్రటేరియట్​ విషయానికొస్తే ఏకంగా జర్నలిస్టులు రాకుండా  బ్యాన్​ విధించారు.

దీనిపై సీఎస్​ కలిసినా.. ఆయన ఒకటే చెప్పేశారు. నిర్ణయం సర్కారుదే నాది కాదు. మీరు వార్తలు రాసినా., రాయకున్నా.. నాకు ఫరక్​ పడదు. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని కాదు. మూడు నెలల్లో రిటైర్​ అవుతున్నాను అని చెప్పేశారు. చెబుతూ చెబుతూ ఆయనొక మాటన్నారు. అది మనసున్నోడి గుండెను కచ్చితంగా సలుపుతుంది. మీరందరూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న సంగతి నాకు తెలియదా..? అని. ఇది చాలదా..? ఇంకా ఏమైనా కావాలా..? జర్నలిస్టులమైన మనకు.  తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మన రాష్ట్రం సాధనలో కీలకంగా ఉన్న మనకు తగిన శాస్తే జరిగింది. అందుకే అంటారు. ఎవరూ మనోళ్లు కాదు. ఎవరూ పరాయోడు కాదు. అవసరానికే అందరూ వాడుకుంటారు. తీరినాక చీదరించుకుంటారు. కాకుంటే కొందరు బహిరంగంగా మరికొందరు బ్యాన్​ పేరుతో.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here