Home జాతీయం సూప‌ర్‌.. క‌ర్ణాట‌క‌లో క‌ల‌క‌ల‌లాడుతున్న‌ ప్ర‌జాస్వామ్యం

సూప‌ర్‌.. క‌ర్ణాట‌క‌లో క‌ల‌క‌ల‌లాడుతున్న‌ ప్ర‌జాస్వామ్యం

299
0
మంత్రులు రాజీనామా చేసిన విష‌యాన్ని ప్ర‌క‌టిస్తున్న సిద్ధ‌రామ‌య్య‌

క‌ర్ణాట‌క‌లో ప్ర‌జాస్వామ్యం క‌ల‌క‌ల‌లాడుతోంది. రీన్ స‌బ్బు, స‌ర్ఫ్ ఎక్సెల్ క‌లిపి ఉతికితే.. బ‌ట్ట‌లు ఎంత త‌ల‌త‌ల‌లాడుతాయో.. ప్ర‌జాస్వామ్యం అంత త‌ల‌త‌ల‌లాడుతోంది. ప్ర‌జ‌ల కోసం వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, మంత్రులు పాపం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం లేద‌న్న ఆవేద‌న‌తో వారు త‌మ ప‌ద‌వుల‌కు స్వ‌చ్ఛందంగా రాజీనామా చేశారు. చివ‌ర‌కు మంత్రులు కూడా స్వ‌చ్ఛందంగా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసేశారు. తాము రాజీనామా చేసిన విష‌యాన్ని కాంగ్రెస్ మంత్రుల ప‌క్షాన సిద్ధరామ‌య్య ప్ర‌క‌టించేశారు.

ప్ర‌జ‌ల కోసం సిద్ధ‌రామ‌య్య‌ను ముఖ్య‌మంత్రిగా చేయాల‌ని కొంద‌రు కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు కొట్లాడుతుంటే.. అసలు సిస‌లుగా ప్ర‌జ‌ల కోసం తమ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కొట్లాడుతున్నార‌ని.. ఆయ‌నే కొన‌సాగాల‌ని జేడీఎస్ ఎమ్మెల్యేలు ప‌ట్టుప‌డుతున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే.. ఆయ‌నే.. ఉండాలి ఆయ‌న కోసం త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసేస్తున్నామ‌ని జేడీఎస్ మంత్రులు ప్ర‌క‌టించేశారు. ప్ర‌జ‌ల కోసం కాంగ్రెస్‌, జేడీఎస్ కొట్లాడుతుంటే.. మాకేం త‌క్కువ మేమూ ప్రజ‌ల కోస‌మే క‌ష్ట‌ప‌డుతున్నాం.. ముఖ్య‌మంత్రిగా యెడ్యూర‌ప్ప అయితే ఈ రాష్ట్రానికి, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఎంతో మేల‌ని బీజేపీ చెబుతోంది. అందుకోస‌మే.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారని చెబుతోంది. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం బ‌తికాలి. ఇక్క‌డి ప్ర‌జలు సుఖ సంతోషాల‌తో జీవించాలి. అందుకోస‌మే ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల‌ను.. ద‌గ్గ‌రుండి తాము ముంబాయికి పంపించ‌లేద‌ని, పంపించిందెవ‌రో త‌మ‌కు తెలియ‌ద‌ని బీజేపీ చెబుతోంది.

ఎమ్మెల్యేలుగా గెల‌వ‌డంలో, మంత్రి ప‌ద‌వులు తీసుకోవ‌డంలో.. కావాల‌ని కోరుకోవ‌డంలో.. మంత్రి ప‌ద‌వుల కోసం రాజీనామాలు చేయ‌డంలో త‌మ స్వార్థం ఎంత‌మాత్రం లేద‌ని కేవ‌లం.. కర్ణాట‌క‌లో ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించాల‌ని, ఇక్క‌డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాల‌ని త‌మ బ‌ల‌మైన కోరిక అని బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు వేర్వేరుగా చెబుతున్నారు. ప్ర‌జ‌ల కోసం ఇంత‌గా క‌ష్ట‌ప‌డుతున్న ఎమ్మెల్యేల‌ను అభినందిద్దామా..? వారి మెడ‌లో అభినంద‌న మందార‌మాల‌లు వేద్దామా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here