Home breaking news సీఎం కేసీఆర్ దేముడు.. ఆయన కారు పుష్పక విమానం

సీఎం కేసీఆర్ దేముడు.. ఆయన కారు పుష్పక విమానం

155
0
సీఎం కేసీఆర్

ఇయ్యాల ఆంధ్రజ్యోతి ఒక కథనం బెల్ట్​ బ్యానర్​లో వచ్చింది. కేసీఆర్​, ఆయన కారు ఫొటోనూ యాదాద్రి లక్ష్మీనర్సింహా స్వామి కొత్త గుడిలోని రాతి స్తంభాలపై చెక్కారని. ఇది అబద్ధమేమీ కాదు. ఎందుకంటే ఫొటోలతో సహా వచ్చింది కాబట్టి. దీన్ని చూసి కేసీఆర్​ అభిమానులు తెగ మురిసిపోతున్నట్టుంది. మా కేసీఆర్​ దేముడు. ఆయన కారు పుష్పక విమానం అని అనుకుంటున్నట్టున్నారు. ఏ గుడిలోనైన రాతి స్తంభాలపై దేముళ్ల ఫొటోలు మాత్రమే ఉంటాయి. వాళ్లు వాడిన వాహనాల ఫొటోలు కూడా ఉండి ఉండవచ్చు. ఎందుకంటే పుష్పక విమానాన్ని కొందరు దేముళ్లు.. జంతువుల ప్రేమతో కావొచ్చు.. మరికొందరు దేముళ్లు మాత్రం  నెమళ్లు ఇలా మరికొన్నివాటిపై ప్రయాణం చేశారని కథల్లో ఉంది. వీటి ఫొటోలు మాత్రమే ఉంటాయి.

ఇప్పుడు యాదాద్రిలోని ఈ గుడిలో కేసీఆర్​ ఫొటో. ఆయన వాహనం కారు ఫొటో దర్శనమిచ్చింది. అంటే ఆయన దేముడు అన్నట్టే.. ఆయన కారు పుష్పక విమానం అన్నట్టేగా అన్నది టీఆర్​ఎస్​ లీడర్ల వాదన కావచ్చు. యాదాద్రి గుడి కొత్తగా నిర్మించి చరిత్ర సృష్టిస్తున్నారన్న వాదనలో నిజముంది. కానీ రాజుల పరిపాలన కాలంలోనైనా.. ఇప్పుడైనా ఏ గుడి కట్టినా.. దానికి సంబంధించిన శిలా పలకాలు ఏర్పాటు ఉంటాయి. అది ఎప్పుడు కట్టిందో ఈ పలకాలపై చెక్కి ఉంటాయి. కేసీఆర్​ ఫొటో మాధిరిగా ఎవరిదైనా రాతి స్తంభాలపై చెక్కి ఉన్న విషయం మాత్రం దాదాపుగా లేదు. కేసీఆర్​ మాత్రం చరిత్ర సృష్టించుకున్నారు.

మీరు దేముడు సామీ అని కొందరిని అప్పుడప్పుడు అంటుంటారు. కొందరికి బతికున్నప్పుడే గుళ్లు కడుతుంటారు. ఇది తమిళనాడులో కన్పిస్తోంది. అక్కడ నాయకులతో పాటు సినిమా యాక్టర్లకు గుళ్లు కట్టడం సర్వ సాధారణం. మరికొందరిని నిత్యం పూజిస్తూ ఉంటారు. ఇది చిన్నజీయర్​ స్వామి లాంటి వాళ్లకు పరిమితం. అతికొద్ది మందికే నిత్యం పాలాభిషేకం చేస్తుంటారు.  ఇప్పటి వరకూ ఈ పాలాభిషేకం పేటేంట్​ టీఆర్​ఎస్​కు మాత్రమే ఉండేది. ఎందుకంటే ప్రతినిత్యం కేసీఆర్ ఫొటోలకు పాలాభిషేకం చేస్తూ ఉంటారు. కేసీఆర్​ అంటే పడనోళ్లు మాత్రం.. ఈ పాలాభిషేకం కారణంగానే.. పాల రేట్లు పెరుగుతున్నాయని జోకులేస్తుంటారు.

ఆంధ్రజ్యోతిలో ఈ రోజు వచ్చిన కథనం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here