Home breaking news సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనూ వెళ్లారు.. వచ్చేశారు..! ఇంతకీ ఏం జరిగినట్టు

సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనూ వెళ్లారు.. వచ్చేశారు..! ఇంతకీ ఏం జరిగినట్టు

166
0
ఫొటో: ఇంటర్​నెట్​ నుంచి

– వికాస్​ రుషి

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఢిల్లీకి వెళ్లారు. వచ్చేశారు. కానీ విమానాశ్రయంలో తిరిగి వస్తున్న ఫొటో తప్ప ఇంకో ఫొటో  ఎక్కడా లేదు. సమాచారం అసలేలేదు.  బీజేపీ లక్ష్మన్​ మాత్రం కాళ్లు.. బతిమాలింపులు అంటున్నారు. ఎక్కడా క్లారిటీ మాత్రం కన్పించడం లేదు. అందుకే ఎన్ని అనుమానాలు కలగాలో అన్ని అనుమానాలు కలుగుతున్నాయి. కేసీఆర్​ పర్యటన ఉందంటే అరివీర భయంకర రీతిలో ప్రచారం చేసే అధికార పత్రిక నమస్తే తెలంగాణలో ‘ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్​’ అని మూడో తారీఖు వచ్చింది. రెండు రోజుల పర్యటనలో  భాగంగా ఢిల్లీకి వెళ్తున్నారని, పవర్ ఫైనాన్స్​​ కార్పోరేషన్​ చైర్మన్​ రాజీవ్​ శర్మ ఇంట్లో వివాహ వేడుకల్లో పాల్గొంటారని, ఆ తరువాత ప్రధాని నరేంద్రమోదీని, ఇతర మంత్రులను కలుస్తారని సమాచారమని పెట్టేశారు. అధికార పత్రిక కాబట్టి.. కచ్చితంగా జరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ రాజీవ్​ శర్మ ఇంట్లో జరిగిన వివాహ వేడుకల్లో కేసీఆర్​ పాల్గొన్న ఫొటో ఎక్కడా కన్పించలేదు. ప్రధానిని కలుస్తున్నట్టు లేదా కలిసినట్టు ఎక్కడా లేదు. చివరకు అపాయింట్​మెంట్​ కోరినట్టు కూడా లేదు.

రెండు రోజుల పర్యటన అన్న నమస్తే తెలంగాణలోనే.. కేసీఆర్​ తిరిగొచ్చేశారని బుధవారం వచ్చింది. వెలుగు, నవ తెలంగాణ వంటి పత్రికల్లో కేసీఆర్​ను విమానాశ్రయంలో జాతీయ జర్నలిస్టులు ‘దిశ’ గురించి ప్రశ్నించినట్టుగా ఫొటోలతో వచ్చింది. కేసీఆర్​ పర్యటన అంటే ఎలా ఉంటుందో ఫెడరల్​ ఫ్రంట్​, రాష్ట్రాల్లో పర్యటన, ఢిల్లీలో కేంద్రమంత్రులతో కలిసిన ఉదంతాలు అబ్బో ప్రచారం ఆర్భాటం మనకు తెలియంది కాదు.  నిన్నటి పర్యటనలో ఏం జరగలేదు. చిన్న వార్తలతో సరిపోయింది. ఇక్కడి వరకూ బాగానే.. ఉన్నట్టుండి కేటీఆర్​ ‘రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యమివ్వడం లేదు. దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూస్తోంది’ అంటూ విమర్శించేశారు. ఆ వెంటనే బీజేపీ లక్ష్మణ్​ నుంచి కౌంటర్​. అక్కడ కాళ్లు పట్టుకుంటారు. ఇక్కడ గాండ్రిస్తారంటూ వెటకారమాడేశారు. అంటే ఢిల్లీలో ఏం జరిగిందో లక్ష్మణ్​ చెప్పినట్టా..? లేకుంటే కేసీఆర్​ చేసిన విన్నపాలకు (ఎక్కడ ఎలా చేశారన్న విషయంలో క్లారిటీ లేకున్నా) ప్రధాని మోదీ నుంచి స్పందన రాలేదని కేటీఆర్​ చెప్పినట్టా..? అసలు ఢిల్లీ పర్యటనలో.? ఏం జరిగిందో మనకు క్లారిటీ లేదు కానీ.. అదిగో ఇదిగో అంటూ చెప్పే మీడియాకు కేసీఆర్​ సమాచారం  తెలియదని కోవా..? ఉద్దేశపూర్వకంగానే రాయలేదా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here