Home breaking news సీఎం కేసీఆర్ కు షాక్.. మున్సిపల్ చట్టాన్ని ఆమోదించని గవర్నర్

సీఎం కేసీఆర్ కు షాక్.. మున్సిపల్ చట్టాన్ని ఆమోదించని గవర్నర్

173
0

ముఖ్యమంత్రి కేసీఆర్ కు తొలిసారిగా షాక్ తగిలింది. ఇన్నాళ్లు సర్కారు తీసుకున్న నిర్ణయాలు, చట్టాలపై ఆమోద ముద్ర వేసిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్.. మున్సిపల్ చట్టం విషయంలో సంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు. ఈ చట్టాన్ని తిప్పి పంపారు. ఈ చట్టంలో పలు
సవరణలు చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారాలు తొలగింపు పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను తొలగించే అధికారం కలెక్టర్లకు ఇవ్వడంపై కూడా గవర్నర్ అభ్యంతరం చేశారు. 85 శాతం హరితహారం మొక్కలు బతకపోతే వార్డు మెంబర్లను తొలగిస్తామనటంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ఆమోదించకుండా తిప్పి పంపడం, అసెంబ్లీ ప్రొరోగ్ కావడంతో ఈ చట్టంపై ఆర్డినెన్స్ తెచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here