Home breaking news సీఎం కుర్చీ కక్షలో ప్రవేశించిన యడ్యూరప్ప- 3 కాసేపట్లో లక్ష్యాన్ని తాకే ఛాన్స్

సీఎం కుర్చీ కక్షలో ప్రవేశించిన యడ్యూరప్ప- 3 కాసేపట్లో లక్ష్యాన్ని తాకే ఛాన్స్

109
0

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాసం నిలుపుకోలేక చతికిల పడ్డారు. తన పదవికి రాజీనామా చేశారు. దీనికోసమే కాచుకూర్చున్న మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప-3 సీఎం కుర్చీ ఉన్న కక్షలోకి ప్రవేశించారు. ఇక లక్ష్యాన్ని చేరుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. యడ్యూరప్ప ఆశలు ఫలిస్తే మూడోసారి ముఖ్యమంత్రి అయినట్టు. మొదటిసారిగా 2009 ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు గెలవడంతో యడ్యూరప్ప సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలు, మహిళా మంత్రి శోభ వంటి కారణాలతో ఆయన వైదొలిగారు. ఆ తరువాత ఆయన సొంతంగా పార్టీ పెట్టడం వంటి పరిణామాలు జరగడం, చివరకు మళ్లీ బీజేపీలో విలీనం కావడం జరిగిపోయింది. 2018 ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలవడం.. తక్కువైన సీట్లను సాధించుకుంటానన్న నమ్మకంతో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. చివరకు ఐదు రోజుల్లో విశ్వాసం సాధించలేక రాజీనామా చేశారు. ఆ తరువాత కాంగ్రెస్, జేడీ(ఎస్) జట్టుకట్టడం.. కుమారస్వామి సీఎం కావడం వేగంగా జరిగి పోయింది. 14 నెలల సంకీర్ణ సర్కారు విశ్వాసం నిలబెట్టుకోలేక కూలిపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి యడ్యూరప్ప సీఎం కుర్చీలో కూర్చోవడానికి రెడీ అయ్యారు. గవర్నర్ ను కలవనున్నారు.

అన్ని సజావుగా సాగితే సీఎం అవుతారు. ఆ తరువాత ఆ ముళ్ల కుర్చీలో ఎన్నాళ్లు కూర్చుంటారో చూడాలి.
118 మంది సభ్యులున్న కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ సర్కారుకు విశ్వాస పరీక్షలో 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కుమారస్వామి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here