Home breaking news సినీ ప‌రిశ్ర‌మ‌లో.. రాజ‌కీయ చిత్రాలు

సినీ ప‌రిశ్ర‌మ‌లో.. రాజ‌కీయ చిత్రాలు

254
0

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్న‌న్ని రాజ‌కీయాలు.. రాజ‌కీయ పార్టీల్లో క‌న్పించేవీ కావు. ఇప్పుడు ప‌రిస్థితి మారింద‌నుకోండి. అయిన‌ప్ప‌టికీ.. చిత్ర ప‌రిశ్ర‌మ స్థాయిలో రాజ‌కీయాలు మాత్రం పొలిటిక‌ల్‌లో క‌న్పించ‌వు. అస‌లు విష‌యానికొస్తే.. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రాజ‌కీయాలు.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ కాలం నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. ఆ త‌రువాత ఈ జాబితాలో కృష్ణ చేరారు. నటులుగా న‌ట‌న‌లో పోటీ ప‌డితే ప‌ర‌వాలేదు. కానీ.. వీరికి ఒక‌రి పొడ మ‌రొక‌రికి గిట్ట‌కుండా పోయేది. కొన్ని సంద‌ర్భాల్లో ఒకే పేరుతో సినిమాలు తీయ‌డం వ‌ర‌కూ వ‌చ్చింది. సినిమా రంగంలో ఎన్టీఆర్‌, కృష్ణ మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొన్న స‌మ‌యంలో అభిమానుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగేవీ. కాంగ్రెస్ ప‌క్షాన కృష్ణ ప్ర‌చారం నిర్వ‌హించేవారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయ‌డం, ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీలో కూర్చోవ‌డం జ‌రిగిపోయింది. ముఖ్య‌మంత్రిగా ఎన్టీఆర్ తీసుకున్న‌నిర్ణ‌యాలు, ఆయ‌న వేష‌ధార‌ణ సంఛ‌ల‌నంగా మారాయి. తాలుకాల‌ను తొల‌గించి మండ‌లాల‌ను ఏర్పాటు చేయ‌డం, గండిపేట చెరువు, ఎన్టీఆర్ కాషాయ వ‌స్త్ర‌ధార‌ణ‌, రోడ్డుపై స్నానాలు, రాత్రి వేళ‌ల్లో పూజ‌లు చేయ‌డం వంటివి చేశారు. ఈ త‌రుణంలో ఎన్టీఆర్‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుతో హీరో కృష్ణ వ‌రుస‌గా కొన్ని రాజ‌కీయ చిత్రాలు నిర్మించారు.

మండ‌లాధీశుడు
ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌కు సినిమా రంగంతో పాటు రాజ‌కీయంగా బ‌ద్ద విరోధిగా ఉన్న ప్ర‌ముఖ నటుడు కృష్ణ వ‌రుస‌గా రాజ‌కీయ సినిమాలు నిర్మించారు. మండ‌లాధీశుడు, గండిపేట ర‌హ‌స్యం, నా పిలుపే ప్రభంజ‌నం వంటి సినిమాలు రూపొందించి విడుద‌ల చేశారు. ఈ సిన‌మాలో ఎన్టీఆర్ పాత్రలో ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టీస్ట్, బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోట శ్రీనివాస‌రావు న‌టించారు. అప్ప‌ట్లో ఈ సినిమాలు ఉమ్మడి రాష్ట్రంలో సంఛ‌ల‌నం క‌ల్గించాయి. ఇప్పుడు అదే కోవ‌లో ఎన్టీఆర్‌ను రాజ‌కీయంగా వాడుకోవ‌డానికి చంద్ర‌బాబు నేతృత్వంలో క‌థ‌నాయకుడు, మ‌హానాయ‌కుడు చిత్రాలు రాగా.. అదే కోవ‌లో ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి ప్ర‌వేశించ‌డం, చంద్ర‌బాబు వెన్నుపోటు వంటి అంశాల‌తో ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ల‌క్షీస్ ఎన్టీఆర్‌ పేరుతో తీసిన చిత్రం మార్చి 22న విడుద‌ల‌వుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here