Home breaking news సిగ్గుపడడానికి కూడా ఈ రాజకీయ నాయకులు పనికిరారు

సిగ్గుపడడానికి కూడా ఈ రాజకీయ నాయకులు పనికిరారు

111
0
  • వికాస్​ రుషి

సిగ్గుపడడానికి కూడా పాలకులుగా మారిన ఈ రాజకీయ నాయకులు పనికిరారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు.. అప్పటి నుంచి అధికారంలో ఉన్న వాళ్లందరూ ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా చెప్పుకునే సొల్లు ఎంటంటే.. ఈ దేశాన్ని.. రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశామని. అభివృద్ధి ఎక్కడ అంటే ఇదుగో అంటూ కాకి లెక్కలు చూపిస్తారు. పైన ఫొటో చూస్తే చాలు వీళ్లు చేసిన అభివృద్ధి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. డెలివరీ కావడానికి వాగు దాటింది. డెలివరీ అయిన తరువాత కూడా వాగుదాటింది. ఆ తల్లి. ఇక అభివృద్ధి ఎక్కడుంది.

విషయానికొస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి నిర్మలకు ఆదివారం అర్ధరాత్రి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎడ్లబండి తీసుకొని ఆస్పత్రికి బయలుదేరారు. మధ్యలో మల్లన్న వాగు అడ్డమొచ్చింది. అది వాననీటితో పొంగి పొర్లుతోంది. ఎడ్లు సహకరించలేదు. విధిలేక గర్భిణిని చేతులపై మోసుకుంటూ.. వాగుదాటారు. ఆ తర్వాత అక్కడికి 108 రావడం నిర్మలను తీసుకొని వెళ్లడం జరిగిపోయింది. సోమవారం ఉదయం నిర్మల ఆడపిల్లకు జన్మనిచ్చింది.

తల్లీ..బిడ్డలు  క్షేమంగా ఉండడంతో తిరుగు ప్రయాణమయ్యారు. మళ్లీ అదే మల్లన్న వాగును దాటించడానికు ప్రసవించిన నిర్మలను , పసికందును మళ్లీ కుటుంబీకులు చేతులపై మోసుకొని వాగు దాటారు. ఆ తర్వాత ,  ఎడ్లబండిపై ఇంటికి చేర్చారు. ఇక్కడ విషయమేమిటంటే.. ఇన్నాళ్లు పాలించిన వాళ్ల అభివృద్ధి.. ఒక్క బ్రిడ్జీ కట్టించలేక పోయారా..? ఇదేనా అభివృద్ధి..? ఇదేనా ఇన్నాళ్లు చేసిన సేవ ?  చెప్పుకోవడానికైనా సిగ్గుపడాలి. వీళ్లు సిగ్గుపడడానికి కూడా పనికిరారేమో.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here