Home breaking news *సాహో* ఫ‌స్ట్‌లుక్ రిలీజ్.. ఆగ‌స్టు 15న మూవీ విడుద‌ల‌

*సాహో* ఫ‌స్ట్‌లుక్ రిలీజ్.. ఆగ‌స్టు 15న మూవీ విడుద‌ల‌

247
0

స‌ర్‌ఫ్రైజ్ అంటూ త‌న అభిమానుల‌ను ఊరించిన రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌… ఊరించిన‌ట్టుగానే స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చారు. సింగిల్ ధ‌మాకా అనుకుంటే.. ఆయ‌న అభిమానుల‌కు డబుల్ ధ‌మాకా ఇచ్చేశారు. సాహో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌డంతో పాటు సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. బాహుబ‌లి చిత్రంతో జాతీయ స్థాయిలో ప్ర‌భాస్‌కు గుర్తింపు రావ‌డంతో.. ఆ సినిమాకు కొన‌సాగింపుగా బాహుబ‌లి-2 విడుద‌ల చేశారు. అప్పుడే సాహో షూటింగ్ ప్రారంభించారు. సాహోను కూడా బహు భాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న సాహో ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తున్నామంటూ సోష‌ల్ మీడియాలో సోమవారం ఓ వీడియో రిలీజ్ చేశారు ప్ర‌భాస్‌. నిన్న‌టి నుంచి ప్రభాస్‌ ఇచ్చే సర్‌ప్రైజ్‌ ఏంటా అని ఆయ‌న అభిమానులు.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఆస‌క్తికి త‌గ్గ‌ట్టుగా.. మంగళవారం మద్యాహ్నం 12 గంటలకు ప్రభాస్ ఒక్క‌టి బ‌దులుగా రెండు సర్‌ప్రైజ్‌లు రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించటంతో పాటు ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేశారు ప్ర‌భాస్‌. డిఫరెంట్ స్పెక్ట్స్‌తో సీరియస్‌ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ పోస్టర్‌ క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. రన్‌ రాజా రన్‌ ఫేం ద‌ర్శ‌కుడు సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్ క్వీన్‌ శ్రద్ధా కపూర్ జంట‌గా నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here