లౌకికవాదం.. బీజేపీ మినహా అన్ని పార్టీల నుంచి విన్పించే నినాదం. దేశంలో మైనార్టీలపై ఎక్కడ దాడి జరిగినట్టుగా వార్త వచ్చినా.. లౌకికవాదం నినాదం మరింత ఎక్కువగా విన్పిస్తోంది. అదే మెజారిటీ (హిందూ మతం) వాళ్లపై దాడులు జరగని, ఇంకేదైనా కానీ ఈ మాట విన్పించదు. వరంగల్లో ఒక పూజారిని హత్య చేసినా.. హిందూ మతానికి చెందిన బాలికపై హత్యాచారం జరిగినా… ఈ మాట విన్పించదు. ఈ మాటలు బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ నుంచి వస్తాయి. సరే ఈ లౌకికవాదం ప్రసక్తి ఎందుకొచ్చిందంటే.. ఎన్నికల సందర్భంగా కేరళలోని ఒక చర్చి మనకు సాయం చేసిన వామపక్ష అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి. అని ఆ రాష్ట్రంలోని క్రైస్తవులకు పిలుపునిచ్చింది. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పిలుపుపై రాష్ట్రంలో చర్చ జరుగుతుండడంతో.. కేరళ సీపీఎం నాయకుడు సునీత్ చోప్రా మాట్లాడుతూ.. ‘హిందువుల మీద జరుగుతున్న దాడులపై, హిందూ ధార్మిక సంస్థలు మాట్లాడగా లేనిది, బీజేపీకి ఓటేయొద్దని క్రైస్తవ చర్చిలు చెప్పడంలో తప్పేంటి’ అని ప్రశ్నించారు. ఒక చర్చి ఈ విధంగా కమ్యూనిస్టు పార్టీలకు మద్దతు పలకడం ఇదే తొలిసారి. ప్రతి ఎన్నికల సమయంలో ముస్లిం మత సంస్థల నుంచి కాంగ్రెస్కు ఓటేయాలని పిలుపు రావడం పరిపాటి. కానీ ఈసారి చర్చి నుంచి వామపక్షాలకు ఓటేయాలని పిలుపువచ్చింది. ఈ వివాదం నేపథ్యంలో ఓటర్లును ప్రభావితం చేసే ప్రసంగాలను నిర్వహించ వద్దని ఇదుక్కి జిల్లా చర్చి బిషప్ మార్ మ్యాథ్యూ.. మతబోధకులకు హెచ్చరించారు. ఇటువంటి పిలుపు వల్ల.. భవిష్యత్తులో చర్చి కార్యకలాపాలకు నష్టం వాటిల్లే అవకాశముందని చెప్పుకొచ్చారు. ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో ప్రజలు చాలా తెలివిగా ఉన్నారని, చర్చి మతబోధకులు ఏ పక్షానికీ తలొగ్గకుండా ఉండాలని ఆయన సూచించారు. ఇంతవరకూ బాగానే ఉంది. అసలు కథేమిటంటే.. ఇదే బిషప్ మార్ మాథ్యూ మద్దతుతో 2014 లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ అభ్యర్థి జాయ్స్ జార్జ్ దాదాపు 50 వేల మెజార్టీతో గెలుపొందారు. అందుకే అంటారు చెప్పేవారు పాటించరు. చర్చి మద్దతు ప్రకటనలోని వామపక్షాలు మనకు సాయం చేశాయి. వాటిని గెలిపించాలి. అంటే ఏ విధమైన సాయం చేశారన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎప్పుడు లౌకికవాదం అని చెప్పే ఈ లెఫ్ట్ పార్టీలు చర్చి మద్దతును ఎలా స్వీకరిస్తాయని బీజేపీ నుంచి ప్రశ్నలు వస్తే ఈ కామ్రెడ్స్ ఏం చెబుతారో.