Home జాతీయం సందు దొరికినప్పుడే…. సంగతి చూస్తరు

సందు దొరికినప్పుడే…. సంగతి చూస్తరు

275
0
ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప‌(ఫైల్‌ఫొటో)

ప్రతి ఒక్కడికి టైం వస్తది.. అప్పుడు తామేంటో టైం వచ్చినోడు సుపిస్తడు. దీన్నే తెలంగాణల సందు దొరికినప్పుడే.. సంగతి చూస్తారని అంటరు. విషయమేమిటంటే.. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన బ్రదర్ కోనేరు కృష్ణ చాలా పవర్ ఫుల్ అని టాక్. నియోజకవర్గంల ఎం చేయాలన్న అల్లే చేస్తారట. అల్లు చెప్పింది కరెక్ట్. అల్లు కాదంటే తప్పే. దింట్ల ఎక్కువ తక్కువల్ లేవు. వీడు వాడు అన్న తేడా అస్సల్ లేదు. ప్రెస్ అయినా పోలీస్ అయినా ఇంకెవ్వడైనా సరే. బ్రదర్స్ మాట వినకుంటే.. అల్లకు రివర్స్ ఏదన్న రాస్తే.. చేస్తే బత్త.కట్. పోలీసోళ్లకు ట్రాన్స్ఫరర్స్.. ప్రెస్ వాల్ల మీద కేసులు.. ఇయన్ని చూసినోడు నాకెందుకు పంచాయితీ.. అనుకొని కడుపుల సల్ల కదలకుండా కుసున్నారు. నిన్న బ్రదర్ కోనేటి కృష్ణ.. ఫారెస్ట్ అధికారి అనిత మీద దాడి చేసికొడ్తున్నప్పుడు కూడా పొలిసొళ్ళు అందుకే సపుడు చేయలేదంట. తీరా పంచాయితీ పెద్దగాయే.  ఆఫీసర్ ఆస్పటళ్ల పడే. కేసు..కూడా అయే. ఇద్దరాఫీసర్లను సస్పెండ్ కూడా చేసిరి. నిన్నటిదాకా సప్పుడేక ఉకున్న ప్రెస్ జూలు విదిల్చింది. అన్ని రాసేసింది. పోలీసోళ్లు రోడ్డెక్కిన్రు. ఎమ్మెల్యే బ్రదర్ నే కాదు.. ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టాలని. అందుకే అంటారు.. పగిలేదాక బుగ్గలో గాలి నింపొద్దయ్య అని వినరు కదా. పట్టు విడుపులు ఉంటే పంచాయితీ ఉండదు. బ్రదర్స్ వద్ద మాత్రం.. పట్టే విడుపు మాత్రం లేదు. ఇప్పుడు పోలీసోళ్లదే తప్పని చెప్పాలంటూ కోనప్ప బెదిరిస్తున్న వీడియో బయటకొచ్చే. ఇంకెంది సందు దొరికింది.. బ్రదర్స్ సంగతి అందరూ చూస్తుండ్రు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here