Home breaking news సంఘ్ మనోగతాన్ని ఆవిష్కరించిన చీఫ్ మోహన్ భగవత్

సంఘ్ మనోగతాన్ని ఆవిష్కరించిన చీఫ్ మోహన్ భగవత్

243
0
ఫొటో: ఇంటర్​నెట్​ నుంచి సేకరణ

–వికాస్​ రుషి

తెలంగాణ వేదికగా.. రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ మనోగతాన్ని.. చీఫ్​ మోహన్​ భగవత్​ ఆవిష్కరించారు. ప్రతీ ఒక్కరూ మన దేశం కోసం.. భరతజాతి ఆనందం కోసం ఏకం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని సరూర్​నగర్​లో జరుగుతున్న విజయ సంకల్పసభలో ఆయన మాట్లాడారు. దేశంలోని అందరూ ఒకటే అని.. అందరూ చేయిచేయి కలిపి నడిస్తేనే అది భారతీయత అని స్పష్టం చేశారు. అయితే ఈ స్వభావం మన భూమిలోనే ఉందన్నారు. సంప్రదాయం, నమ్మకాలు ఎన్ని ఉన్నా.. దేశం కోసం.. జాతి కోసం అందరూ ఒకేరకంగా ఆలోచించాలని కోరారు. అదే సంఘ్​ కోరుకుంటోందని చెప్పారు. అయితే కొందరు వ్యక్తులు.. కొన్ని శక్తులు దేశ ప్రజలను భయపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంతోనే.. దేశంలో మార్పు సాధ్యమని.. ఈ  రాజకీయ నాయకులు.. ప్రభుత్వాలు మార్చలేవన్నారు. దేశం కోసం త్యాగాలు చేసేందుకు మనంతమనంగా సిద్ధపడినప్పుడే మార్పు సాధ్యపడుతుందన్నారు. సంఘ్‌ అలాంటి మార్పుకోసమే ప్రయత్నిస్తోందని భగవత్ చెప్పారు.

రవీంద్రనాథ్​ ఠాగూర్​ చెప్పినట్టుగా సమాజం అంతా ఒక్కతాటిపై నడవాలన్నదే హిందుత్వ విధానమని.. ఇదే సంఘ్​ విధానమని ఆయన  ప్రకటించారు. భూమి, నీరు, అడవులు, జీవులు అన్నింటిని ఒకే దృష్టితో చూస్తూ పరిరక్షించాలని ఇదే సంఘ్​ విధానమన్నారు. మన దేశం ప్రపంచానికి విశ్వగురువుగా మారి.. దారి చూపాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ‘ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భరతమాత బిడ్డలే. ఎవ్వరిని పూజించినా.. విశ్వాసం ఏదైనా.. ఇందులో మార్పు ఉండదు.’ అని స్పష్టం చేశారు. వివేకానందుడు చెప్పినట్టు.. ముక్కోటి దేవతలను పూజించకున్నా.. భరతమాతను పూజిస్తే చాలన్నారు. ఈ దేశం కోసం జీవించాలని మోహన్​ భగవత్​ పిలుపునిచ్చారు. ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న ఆందోళనలపై ఆయన మాట్లాడారు. మంచి చేయాలనుకుంటున్నది ఎవరో.. బురద జల్లుతున్నదెవరో దేశ పౌరులు తెలుసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here