Home తాజా వార్తలు సంక్షోభాలు ఎదుర్కున్న న్యాయ వ్య‌వ‌స్థ‌- జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

సంక్షోభాలు ఎదుర్కున్న న్యాయ వ్య‌వ‌స్థ‌- జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

197
0
????????????????????????????????????

హైద‌రాబాద్ః సుదీర్ఘకాలంలో న్యాయ వ్య‌వ‌స్త ఎన్నో సంక్షోభాల‌ను ఎదుర్కున్న‌ద‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. తెలంగాణ హైకోర్టు వందేళ్ల వేడుక‌ల్లో ఆయ‌న మాట్లాడారు. న్యాయ వ్య‌వ‌స్థ ఎన్ని సంక్షోభాలు ఎదుర్కున్నా.. వ్య‌వ‌స్థ ప‌ట్ల సామాన్యుల‌ విశ్వాసం కాపాడాల్సిన బాధ్య‌త ఉంద‌న్నారు. వ్యక్తుల ఆధిపత్యాన్ని తగ్గించ‌డంతో పాటు న్యాయ వ్యవస్థ ను ఉన్నత స్థాయి లో ఉంచాల్సిన భాద్యత అందరి పై ఉందని అయన గుర్తుచేశారు .రూల్ అఫ్ లా ను సరిగా అమలు పరచాల్సిన గురుతర భాద్యత న్యాయ వ్యవస్థ పై ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర హై కోర్టు  ప్రధాన న్యాయ మూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహన్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ సమాజం లో శాంతి ని తీసుకువస్తుందన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకొని తదనుగుణంగా ముందుకు నడవాలన్నారు . రాష్ట్ర హై కోర్టు లో 1.93 ల‌క్ష‌ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, జిల్లా కోర్టుల్లో 5 ల‌క్ష‌ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. సమస్యలను పరిష్కరించేందుకు విభేదాలను తొలగించి ఒక జట్టుగా కలిసిమెలిసి పనిచేయాలన్నారు. ఈ వేడుకలలో హై కోర్టులో న్యాయవాదులు గా కేసులు వాదించి సుప్రీమ్ కోర్టులో న్యాయ‌మూర్తులుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న ముఖ్యులు కోర్టు తో తమకున్న అనుభవాలను ఆహుతులతో పంచుకున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here