Home breaking news వ‌య‌నాడ్‌లో రాహుల్ గెల‌వ‌డానికి వీళ్లే కార‌ణ‌మంట‌

వ‌య‌నాడ్‌లో రాహుల్ గెల‌వ‌డానికి వీళ్లే కార‌ణ‌మంట‌

99
0
ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ (ఫైల్‌ఫొటో)

హైద‌రాబాద్ః ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీలో ఓడిపోయారు. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో అత్య‌ధిక మెజారిటీతో గెలిచారు. వ‌య‌నాడ్‌లో రాహుల్ గెల‌వ‌డానికి గ‌ల కార‌ణాలేమిటో..? మ‌జ్లీస్ పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ వెల్ల‌డించారు. రాహుల్‌బాబు కుటుంబ స్థానం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీ. ఈ స్థానం ఎప్ప‌టి నుంచో కాంగ్రెస్ గెలుచుకుంటూ వ‌స్తోంది. రాహుల్ కూడా ఇక్క‌డ నుంచే అరంగేట్రం చేశారు. 2014 ఎన్నిక‌ల్లోనే.. అమేథీలో బీజేపీ అభ్య‌ర్థి స్మృతీ ఇరానీ.. రాహుల్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఈసారి కూడా స్మృతీ ఇరానీని రంగంలోకి దించ‌డంతో రాహుల్ అమేథీతో పాటు కేర‌ళ‌లోని వ‌య‌నాడులో పోటీ చేశారు. స్మృతిని చూసి భ‌య‌ప‌డి వ‌యనాడ్‌కు పారిపోయార‌ని బీజేపీ విమ‌ర్శించింద‌నుకోండి. అది వేరే విష‌యం. రాహుల్ సోద‌రి ప్రియాంక రంగంలోకి దిగి ప్ర‌చారం చేసినా.. చివ‌ర‌కు రాహుల్ త‌న కుటుంబ స్థాన‌మైన అమేథీలో ఓడిపోయారు. వ‌య‌నాడ్‌లో మాత్రం 4,31,063 ఓట్ల‌ మెజారిటీతో గెలిచారు.

వ‌య‌నాడ్‌లో రాహుల్ ఎలా గెలిచార‌న్న అంశంపై మ‌జ్లీస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ హైద‌రాబాద్‌లో వివ‌రించారు. వ‌యనాడ్‌లోని ఓట‌ర్ల‌లో 40 శాతం మందికి పైగా ముస్లింలే. వారి కార‌ణంగానే.. రాహుల్ గెలిచార‌ని ఓవైసీ చెప్పుకొచ్చారు. బీజేపీపై ముస్లింలు వ్య‌తిరేకంగా ఉన్నారు కాబ‌ట్టి.. వారందరి ఓట్లు రాహుల్‌కే పడ్డాయని అందుకే భారీ మెజార్టీ వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు దేశంలోని ముస్లింలంద‌రూ బీజేపీకి వ్య‌తిరేమేన‌ని.. అందుకే వారి జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న పంజాబ్‌, కేర‌ళ రాష్ట్రాల్లో బీజేపీకి త‌క్కువ సీట్లు, త‌క్కువ ఓట్లు వ‌చ్చాయ‌ని వివ‌రించారు. ముస్లింలంద‌రూ బీజేపీ వ్య‌తిరేకంగా ఉన్నార‌ని ఓవైసీ చెప్పారు అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది కానీ, ఇటువంటి ప్ర‌చారం కార‌ణంగానే.. బీజేపీకి ఈ ఎన్నిక‌ల్లో మ‌రిన్ని సీట్లు గెల‌వ‌డానికి కార‌ణ‌మ‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్ని పార్టీలూ ముస్లిం బుజ్జ‌గింపు రాజ‌కీయాల కార‌ణంగానే.. హిందువుల్లో బీజేపీకి ఆద‌ర‌ణ పెరుగుతోంద‌న్న అభిప్రాయమూ క‌లుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here