వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుందా..? అనేదీ కొత్తగా వచ్చిన మాట. ఈ మాటకంటే ముందు వేరేది ఉండేదీ అది చాలా మందికి తెలుసు అంతగా విప్పి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సరే వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుందా.? అని ఎందుకు వచ్చిందంటే.. కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరు బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరగడం.. దానికి జవాబుగా చివరకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తానే అనే చెప్పుకోవడం జరిగిపోయింది. ఇదే కోమటిరెడ్డి సోదరులపై 2018 మొదటి వరకూ టీఆర్ఎస్లోనే చేరుతారంటూ నిత్యం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. చివరకు అది జరగలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ బీజేపీలో చేరుతారంటూ ప్రచారం.. దీనికి కొనసాగింపుగా.. తనకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని, తన వారు 30 మందికి టికెట్లు ఇస్తే చేరుతా అని కోమటిరెడ్డి బ్రదర్స్ డిమాండ్ చేశారని కూడా జరిగింది. ఇవేవీ జరగలేదు.
కానీ ఇప్పుడు రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరుతారన్నది స్పష్టమై పోయింది. అందుకు కాంట్రాక్ట్ వ్యవహరాలు, ఆర్ధిక వ్యవహారాలే కారణమని ప్రచారం. కోమటిరెడ్డికి చెందిన కంపెనీ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కాంట్రాక్ట్‌లు నిర్వహిస్తోంది. అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్‌లోనూ నిర్వహించింది. ఈ పనులకు సంబంధించి కోమటిరెడ్డికి డబ్బులు పెద్దమొత్తంలో రావాల్సి ఉందని ప్రచారం. దీని కోసమే బీజేపీలో చేరుతున్నారంటూ కథనాలు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. బీజేపీలో చేరడానికి ఏపీకి చెందిన పార్టీ ప్రధాన కార్యదర్వి రాంమాధవ్ తో కోమటిరెడ్డి టచ్‌లో ఉన్నారు. కానీ అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కేంద్రమంత్రి కిరణ్ రిజుజుకు రాంమాధవ్‌కు పడడం లేదన్న టాక్ బీజేపీలో ఉంది. ఈ విషయంలో కిరణ్ రిజూజును కోమటిరెడ్డి ఒక్కసారి కూడా కలవలేదన్న టాక్ కూడా ఉంది. అటువంటప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రితో పొసగని వ్యక్తి ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరినా.. అనుకున్న పని అవుతుందా..? అన్నది ఇప్పుడు లేవనెత్తున్న అనుమానం
ప్రకటన