Home breaking news వేగంగా వెళ్లిన రైలు కింద నుంచి బ‌య‌ట‌ప‌డిన మృత్యుంజ‌యుడు

వేగంగా వెళ్లిన రైలు కింద నుంచి బ‌య‌ట‌ప‌డిన మృత్యుంజ‌యుడు

94
0
Asangaon railway station maharashtra

రైలు వేగం చూస్తేనే గుండె ద‌డ‌ద‌డ‌లాడుతుంటుంది. అలాంటి వందకు పైగా కిలోమీట‌ర్ల వేగంతో దూసుకొస్తున్న రైలు కింద నుంచి చిన్న‌గాయం కూడా కాకుండా.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడో వ్య‌క్తి. అదేంటో చూద్దాం. మ‌హారాష్ట్రలోని అస‌న్‌గావ్ రేల్వే స్టేష‌న్‌లో ఈ నెల 25 ఘ‌ట‌న జ‌రిగింది. ఈ స్టేష‌న్‌లో ప్ర‌యాణికులు ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జీ మీద నుంచి కాకుండా ప‌ట్టాలు దాటుతూ వేరే ప్లాట్ ఫాం వైపు వెళ్తుంటారు.

అంద‌రిలాగానే.. ఈ వ్య‌క్తి కూడా ప‌ట్టాలు దాట‌బోయే స‌మ‌యంలోనే.. వేగంగా రైలు దూసుకొని వ‌చ్చింది. అంతే ఆ వ్య‌క్తి.. ప‌ట్టాల‌కు.. ఫ్లాట్ ఫాంకు మ‌ధ్య ఖాళీ స్థలంలో కూర్చున్నాడు. ఇది గ‌మ‌నించిన తోటి ప్ర‌యాణికులు ప్రాణాలు ఉగ్గ‌బ‌ట్టుకొని చూస్తున్నారు. రైలు వెళ్లిపోగానే.. ప్ర‌యాణికులు అంద‌రూ ఒక్కఉదుటున అత‌డికి ఏమైన అయిందా అన్న ఆందోళ‌న‌తో చూశారు. కానీ చిన్న‌గాయం కూడా కాకుండా అత‌డు లేచి ఏం జ‌ర‌గ‌నట్టుగా వెళ్లిపోయాడు. ఇది గ‌మ‌నించిన ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here