Home breaking news వెర్రి రిపోర్టింగ్ | Reporting

వెర్రి రిపోర్టింగ్ | Reporting

74
0

వెరైటీ వెర్రిత‌ల‌లు వేస్తోంది. వెరైటీ పేరుతో జ‌నాలు వింత వింత వేషాలు వేస్తుంటే.. ఆ వెర్రిత‌ల‌ల‌ను రిపోర్టింగ్ చేయాల్సిన రిపోర్ట‌ర్లు, యాంక‌ర్లు, యాంక‌ర‌మ్మ‌లు కూడా వెర్రి వెర్రి గా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. మ‌న దాయాది దేశం పాక‌స్థాన్ కూడా వెర్రి రిపోర్టింగ్ చేస్తున్నారు. మ‌న‌ల‌ను చూసి నేర్చుకున్నారో.. వాళ్ల‌ను చూసి మ‌నం నేర్చుకున్నామేమో కానీ, ఒక ఛాన‌ల్ రిపోర్ట‌ర్ అదే విధంగా రిపోర్టింగ్ చేస్తున్నారు. ఆ దేశంలో వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. దీనిని క‌వ‌ర్ చేయ‌డానికి ఒక రిపోర్ట‌ర్ ఏకంగా వ‌ర‌ద‌లో నిలుచొని రిపోర్ట్ చేశాడు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది.

రిపోర్ట‌ర్ నీటిలో ఉన్న‌ప్పుడు వ‌ర‌ద ప్ర‌వాహం పెరిగితే.. అత‌డు కొట్టుకొని పోతాడు క‌దా. ఇది కూడా తెలియ‌దా.? ఇక్క‌డే ఇంత‌కు మందు ఒక రిపోర్ట‌ర్ గాడిద మీద కూర్చుని రిపోర్టింగ్ చేశాడు. అది అత‌డిని కింద ప‌డేసింది. మ‌న తెలుగు మీడియా కూడా త‌క్కువేం కాదు.


మ‌న‌కు గుర్తుండే ఉంటుంది. న‌టి శ్రీదేవి చ‌నిపోయిన‌ప్పుడు తెలుగు టీవీ రిపోర్ట‌ర్ కం యాంక‌ర్ విచిత్రంగా రిపోర్టు చేశారు. ఆమె బాత్‌ట‌బ్‌లో ప‌డి మృతి చెందిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో స‌ద‌రు రిపోర్ట‌ర్ బాత్‌ట‌బ్‌లో దూకి, పడుకొని రిపోర్టింగ్ చేశారు. హైద‌రాబాద్‌లో వ‌ర్షాలు కురిసి రోడ్ల‌పై న‌డుము లోతువ‌ర‌కూ పారిన‌ప్పుడు కూడా మ‌న రిపోర్ట‌ర్లు ఇదే విధంగా క‌వ‌ర్ చేశారు. ద‌య్యాల‌పై స్టోరి చేసన ఛాన‌ల్ ఏకంగా స‌మాధుల‌పై ప‌డుకొని స్టోరీ చేశారు కూడా. కొత్త‌ద‌నం కోసం ఇలా చేస్తున్నామ‌ని చెప్పుకోవ‌చ్చు.. కానీ దీన్నే పిచ్చి పీక్‌కు వెళ్లిందని జ‌నాలు అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here